
బాలకృష్ణ పై శివాజీ సంచలన వ్యాఖ్యలు?
బాలకృష్ణ నందమూరి రామారావు వారసుడుగా , టాలీవుడ్ నట సింహం గా మరియు ఇప్పుడు హిందూపురం ఎమ్మెల్యే గా అందరికి సుపరిచితుడు. అయితే జై సింహా ఆడియో ఫంక్షన్ డిశంబర్ 24 న విజయవాడ లోఅభిమానుల మధ్య అంగ రంగ వైభవంగా జరిగింది. అయితే ఈ ఆడియో ఫంక్షన్ కి అత రధ మహారధులందరూ హాజరైయ్యారు. విజయవాడ గ్రౌండ్ మొత్తం అభిమానులతో జై బాలయ్య అంటూ నినాదాలతో మారుమోగిపోయింది.

అయితే అందరు స్టేజ్ పైకి వచ్చి అన్ని ఆడియో ఫంక్షన్ లా మాదిరిగా బాలయ్య ను పొగిడినారు. బాలయ్య కు మరో విజయం ఖాయమని అందరు మాట్లాడినారు. అయితే ఈ ఆడియో ఫంక్షన్లో మా అసోసియేషన్ అధ్యక్షడు శివాజీ రాజా బాలక్రిష్ణ వ్యక్తిత్వం మీద విలక్షణమైన కామెంట్స్ చేసినాడు. బాలయ్య ను బాబు, బాబు అని సంభోదించి అందరిని ఆకట్టుకున్నాడు.

అయితే శివాజీ రాజా కు ఒకరు సినిమా వారు కాల్ చేసి తనకు క్యాన్సర్ ఉందని తనకు డబ్బ్బులు హెల్ప్ చేయమని అడిగాడంటా, అయితే శివాజీ రాజా వెంటనే బాలయ్య కు ఫోన్ చేసి , విషయం చెప్పి తన హాస్పిటల్ లో వైద్యం చేయించమని అడిగాడంట. అప్పుడు పదిగంటల సమయంలో బాలయ్య నేను ఇప్పుడే వస్తున్నా అని అన్నడంటా, ఈ విధంగా బాలయ్య వ్యక్తిత్వం లోని మరో కోణం గురించి శివాజీ రాజా బయట పెట్టి అక్కడున్న వారందరిని ఆశ్చర్య పరిచి నాడు. ఈ విషయం విన్న అభిమానులు బాలయ్య మానవత్వానికి ముగ్దులైపోయారు.