కొరటాల టేకింగ్ ఆ హీరోకి నచ్చడం లేదా అందుకే రిజక్ట్ ?

Prathap Kaluva

కొరటాల శివ టాలీవుడ్ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ స్టార్ డైరెక్టర్. మిర్చి సినిమా తో మెగా ఫోన్ అందుకున్నాడు. అంతకముందు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు రైటర్ గా పనిచేసినాడు. అయితే తనకు రావాల్సిన పేరు రాలేదు. దానితో ఒక్క సారిగా మిర్చి తో డైరెక్టర్ గా మారి తన టాలెంట్ ఏంటో ఇండస్ట్రీ కి చూపించాడు. ప్రభాస్ ను క్లాస్ గాను, మాస్ గాను చూపించి అందరిని మెప్పించాడు. అప్పటి నుంచి టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ లిస్టు లో చేరిపోయినాడు.


అయితే తరువాత సినిమా కోసం ఒక సంవత్సరం  పైగా నె నిరీక్షించాల్సి వచ్చింది. ఎట్టకేలకు మహేష్ బాబు ను డైరెక్ట్ చేశాడు తనతో శ్రీమంతుడు సినిమా తీసి ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొట్టాడు.దీనితో మొదటి విజయం గాలివాటం అనుకున్న వారందరికీ సమాధానం చెప్పినాడు. తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ లాంటి మరో బ్లాక్ బాస్టర్ తీశాడు. ఈ విధంగా తను వరుసుగా మూడు బ్లాక్ బాస్టర్ లను  తీసినాడు.


 అయితే అతని టేకింగే నచ్చలేదంటే ఆశ్చర్య వెయ్యొచ్చు. అయితే ఒక హీరో ను చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. అతను ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఇంతక ముందు కోరటాలతో సినిమా ను స్టార్ట్ చేసి మద్యలోనే ఆపేశాడు. ఇప్పుడు కూడా కొరటాల తో సినిమా అనౌన్స్ చేసినాడు. అయితే అది పట్టాలేక్కేటట్లు కనిపించడం లేదు ఎందుకంటే తరువాత సినిమాను బోయపాటి తో ప్రకటించాడు రామ్ చరణ్.


 దాని తరువాత రాజమౌళి మల్టీ స్టారర్ లో నటించనున్నాడు. అయితే కొరటాల టేకింగ్ రామ్ చరణ్ కు నచ్చడం లేదా అనే సందేహాలు అందరికి వస్తున్నాయి. ఎందుకంటే కొరటాల సినిమాలో హీరో పాత్ర కొంచెం సెటిల్ పెర్ఫామన్స్ గా ఉంటుంది. అది తనకు సెట్ అవ్వదని  రామ్ చరణ్ అనుకుంటున్నాడా అందుకే రిజెక్ట్ చేసాడా అని అందరు అనుకుంటున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: