రజనీకాంత్ సంచలనాత్మక ప్రకటన జోష్ లో అభిమానులు !
రజనీకాంత్ అంటే ఒకవ్యక్తి కాదు శక్తి అని రజనీ అభిమానులు భావిస్తూ ఉంటారు. అందువల్లనే ఈసూపర్ స్టార్ కు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది అభిమానులు ఉన్నారు. రజనీకాంత్ పేరుకే తమిళ నటుడు అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా జపాన్ మలేషియాలాంటి దేశాలలోని ప్రజలు కూడ రజనీ కాంత్ ను విపరీతంగా ఆరాదించే అభిమానులు ఉన్నారు. ఇలాంటి సూపర్ స్టార్ రజనీరాజకీయ ఆరంగేట్రం పై గత కొన్ని సంవత్సరాలుగా జర్గుతున్న చర్చకు రజనీకాంత్ క్లైమాక్స్ ట్విస్ట్ ఇచ్చాడు. ఈరోజు చెనైలో తన అభిమానుల సమావేశంలో రజనీ మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. వచ్చే శాసనసభ ఎన్నికల్లోగా తాను కొత్త పార్టీ స్థాపిస్తానని తమపార్టీ 234 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని రజనీకాంత్ స్పష్టం చేసాడు.
అంతేకాదు తాను తమిళ వ్యక్తి కాకపోయినా ప్రతి తమిళుడు తనను అభిమానించి నందువల్ల తాను ఈస్థాయికి వచ్చానని అయితే తమిళ ప్రజలు ప్రస్తుతం ఎదుర్కుంటున్న సమస్యలను చూసి తానూ మౌనంగా ఉండలేనని అందుకే తాను రాజకీయాలలోకి వస్తున్నట్లు ప్రకటన చేసాడు రజనీ కాంత్ ఈప్రకటన చేయగానే రజనీ అభిమానులలో పండుగ వాతావరణం నెలకొని ఉంది. ఈరోజు ఈప్రకటన చేస్తూ రజనీకాంత్ చెప్పిన విషయాలు కూ డా సంచలనంగా మారాయి. రాజకీయాలంటే కేవలం డబ్బు సంపాదించడం పదవులు పొందడం పేరు సంపాదించడం లాంటి స్వార్థపూరిత ఆలోచనలో చాలమంది ఉంటున్నారు అంటూ అయితే తనకు అవేమీ అవసరం లేదని తనకు ఇవన్నీ ఎప్పుడో వచ్చాయి అని అన్నాడు.
అంతేకాదు భ్రష్టు పట్టిన రాజకీయాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు ప్రజలను దోచుకునే విధంగా ఉన్నాయని ప్రజాస్వామ్యం పేరిట కొందరు రాజకీయనాయకులు ప్రజలను దోచుకుంటున్నారు అంటూ రాజకీయ నాయకుల పై మాటల ఎదురు దాడి మొదలు పెద్దాడు రజనీకాంత్. ఇదే సందర్భంలో రజనీ మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రంలోని పరిస్థితులను చూసి ఇతర రాష్ట్రాలు హేళన చేస్తున్నారని ఈసమయంలో తాను రాజకీయ నిర్ణయం తీసుకోకుంటే తప్పు చేసినవాడిని అవుతానని అంటూ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాట ప్రకంపనలు సృట్టి స్తున్నాయి.
ప్రజలకు తానూ
ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితి ఉంటే మూడేళ్లలోనే తన ప్రభుత్వం రాజీనామా చేస్తుంది
అనడంలో రజనీ కమిట్ మెంట్ కనపడుతోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే రజనీకాంత్ తన రాజకీయ ప్రకటన చేసిన కొద్దిగంటలు కూడ కాకుండానే రజనీ పొలిటికల్
ఎంట్రీ పై అనేకమంది రాజకీయ నాయకులు రజనికామెంట్స్ ను టార్గెట్ చేస్తూ తమ మాటల
ఎదురు దాడి మొదలు పెట్టేసారు. ఏదిఏమైనా తమిళనాడులోనే కాదు దక్షిణాదిలోనే సూపర్
స్టార్ గా వెలుగొందుతున్న రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ రానున్న రోజులలో అనేక
సంచలనాలకు తెర తీస్తుంది అనడంలో ఎటువంటి సందేహంలేదు..