ప్రదీప్ కారులో శ్రీముఖి..? నన్ను లాగకండి బాబోయ్..!

shami
న్యూ ఇయర్ పార్టీలో ఫుల్లుగా తాగేసి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన తెలుగు టివి యాంకర్ ప్రదీప్ మాచిరాజు బ్రీత్ ఎనలైజర్ లో 178 పాయింట్లతో దొరికిపోయాడు. తను ప్రయాణిస్తున్న బి.ఎం.డబల్యు కారుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక కౌన్సెలింగ్ కు స్టేషన్ కు రమ్మన్నా సరే రాకుండా ధీమాగా ఉన్నాడు ప్రదీప్. అయితే ఈరోజు వరకు చూసి కౌన్సెలింగ్ కు వచ్చాడా సరే లేదంటే చార్జి షీట్ ఫైల్ చేస్తారని అంటున్నారు.


ఇదిలా ఉండగా ప్రదీప్ ప్రయాణిస్తున్న కారులో అమ్మాయి కూడా ఉందని అంటున్నారు. ఇంతకీ ఆ టైంలో ప్రదీప్ పక్కన ఉన్న ఆమె ఎవరు..? ఆమెకు ప్రదీప్ కు ఉన్న సంబంధం ఏంటి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అయితే కొందరు ప్రదీప్ తో కారులో ప్రయాణిస్తున్నది ఎవరో కాదు మరో యాంకర్ శ్రీముఖి అని అంటున్నారు.


పటాస్ తో బాగా పాపులర్ అయిన శ్రీముఖి ఆ తర్వాత ఎన్నో షోలలో ప్రదీప్ తో కూడా కలిసి చేసింది. ఇక ఆ క్రమంగా వీరిద్దరు ఆ టైంలో కలిసి పార్టీ జరుపుకుని ఇంటికెళ్తుండొచ్చని అంటున్నారు. అయితే ప్రదీప్ కారులో ఉన్నది శ్రీముఖి అన్న కచ్చితమైన ఆధారలేవి లేవు. కచ్చితంగా ఇది గాలీ వార్తే అని అంటున్నారు. 


ఇక ఆరోజు కారులో ప్రదీప్ తో శ్రీముఖినే ఉంది అన్న వార్తలకు స్పందించింది శ్రీముఖి. దయచేసి తనని ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయొద్దని.. చేస్తే వరకు సీరియస్ గా రియాక్ట్ అవ్వాల్సి వస్తుందని అంటుందట. ఇంత కచ్చితంగా చెబుతుంది అంటే ప్రదీప్ కారులో శ్రీముఖి ఉండే సమస్యే లేదని అంటున్నారు. అంతేకాదు కొన్ని మీడియా వర్గాలు ప్రదీప్ కారులో ఒకరు కాదు ఇద్దరు అమ్మాయిలు ఉన్నట్టుగా చెబుతున్నారు. మరి ఇంతకీ అసలు ప్రదీప్ తో ఆ టైంలో ప్రయాణించే వ్యక్తులు ఇద్దరా ఒక్కరా..? అయితే వారు ఎవరు..? అన్నది తెలియాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: