మూడవ సినిమాకు సిద్ధపడుతున్న మహేష్,పూరీ

HANUMA HANUMA
ప్రిన్స్ మహేష్ బాబు, దర్శకుడు పూరీ జగన్నాథ్ కలయికలో వచ్చిన పోకిరి సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త రికార్డులు సృష్టించింది. తరువాత వీరి కలయికలో వచ్చిన బిజినెస్ మేన్ కూడా హిట్ అనిపించుకుంది. కాగా, మళ్లీ వీళ్లద్దరూ మరో సినిమా చేయడానికి సిద్దపడుతున్నారు. మహేష్, పూరీ కాంబినేషన్ లో వచ్చే మూడవ సినిమాను పరమేశ్వర అర్ట్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తాడు. బండ్ల గణేష్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో బాద్ షా సినిమా ను నిర్మిస్తున్నాడు. బాద్ షా సినిమా జనవరిలో విడుదల అవుతుంది. బాద్ షా విడుదల తరువాత పూరీ-మహేష్ ల సినిమా ప్రారంభం అవుతుంది. కాగా, మహేష్ తో పూరీ తెరకెక్కించే మూడవ సినిమా బిజినెస్ మేన్ -2 కాదని, ఓ సరికొత్త కథతో ఈ సినిమా రూపొందుతుందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: