ఇండస్ట్రీ బ్యాకప్ పై రవితేజ సంచలన వ్యాఖ్యలు !

Seetha Sailaja

రవితేజా అంటేనే ఉరిమే ఉత్సాహం. సినిమాలోని తనపాత్ర ఎలాంటిదైనా తన జోష్ ని కొనసాగిస్తూ మాస్ ప్రేక్షకులకు యూత్ కు చాల సులువుగా కనెక్ట్ అయిపోతాడు రవితేజ. ‘రాజా ది గ్రేట్’ ఇచ్చిన సక్సస్ జోష్ లో మరో రెండు రోజుల్లో ‘టచ్ చేసి చూడు’ అని వస్తున్నాడు. ఈసినిమాను ప్రమోట్ చేస్తూ ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవితేజ అనేక ఆసక్తికరవ్యాఖ్యలు చేసాడు.

 

ఫిలిం ఇండస్ట్రీలో ఎవరు ఎవరికీ బ్యాకప్ గా ఉండరని విజయాలు ఉంటేనే పలకరిస్తారని లేదంటే ఎవరు ఎవరివద్దకు రారు అంటూ ఫిలిం ఇండస్ట్రీలోని వాస్తవ పరిస్తుతుల పై కామెంట్స్ చేసాడు. అదేవిధంగా చాలామంది దర్శకులు నిర్మాతలు సక్సస్ ఉన్న హీరోల చుట్టూ తిరుగుతారు అంటూ ఇది అంతా ఒకవ్యాపారం అంటూ సెటైర్లు వేసాడు. ఇదేసందర్భంలో ‘టచ్ చేసి చూడు’ సినిమాలో తానూ పోషించిన పోలీసు పాత్ర తన ‘విక్రమార్కుడు’ సినిమాతో పోల్చవద్దని చెపుతూ ఈమూవీలో తన పోలీసు పాత్ర చాల డిఫరెంట్ గా ఉంటుంది అన్న లీకులు ఇస్తున్నాడు.

 

తెలుగు సినిమా మార్కెట్ పెంచిన ఘనత రాజమౌళికి దక్కుతుంది అనిఅంటూ తాను ఈసినిమా షూటింగ్ కోసం డార్జిలింగ్ వెళ్ళినప్పుడు జరిగిన ఆసక్తికర సంఘటనను వివరించాడు. అక్కడి ప్రజలు తనది ఏప్రాంతం అని అడిగినప్పుడు తాను తెలుగు వాడిని అని చెప్పినా సరిగ్గా గుర్తు పట్టలేదని అయితే రాజమౌళి పేరు చెప్పగానే అక్కడి ప్రజలు తనను గుర్తుపట్టి ‘బాహుబలి’ గురించి మాట్లాడటం తనకు షాక్ ఇచ్చిన విషయం అంటూ రాజమౌళి పై ప్రశంసలు కురిపించాడు. ఇదేసందర్భంలో మాస్ మహారాజా మాట్లాడుతూ తాను ఏదోఒకరోజు దర్శకుడుగా మారుతానని అయితే అది ఎప్పుడో ఇప్పుడు చెప్పలేను అని అంటున్నాడు.

 

తన కొడుకు మహాథన్ వయస్సు కేవలం 10 సంవత్సరాలు మాత్రమే అనీ అయితే తన కొడుకుకు ఇష్టం ఉంటే తాను అతడిని హీరోగా పరిచయం చేయాలని ఉందని అంటూ భవిష్యత్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు అంటూ తనకొడుకు ఫిలిం ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చాడు. రవితేజా ఒకకొత్త దర్శకుడుని నమ్ముకుని చేస్తున్న ఈప్రయోగం పై ఇండస్ట్రీ వర్గాలలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే రావితేజాకు బాగా కలిసి వచ్చిన పోలీసు పాత్ర కాబట్టి ఈసినిమా కూడ హిట్ అవుతుంది అన్న నమ్మకంలో మాస్ మహారాజా ఉన్నాడు


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: