భగభగ..భగభగ.. 'భాగమతి'.. రుద్రమదేవి రికార్డ్ బ్రేక్..!

shami
స్వీటీ అనుష్క లీడ్ రోల్ లో అశోక్ డైరక్షన్ లో యువి క్రియేషన్స్ నిర్మించిన సినిమా భాగమతి. ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా టాక్ మాత్రమే కాదు కలక్షన్స్ కూడా సినిమాను బ్లాక్ బస్టర్ అనేలా చేస్తున్నాయి. ఇప్పటికే పాతిక కోట్ల షేర్ వాల్యూతో సంచలనంగా మారిన భాగమతి అమెరికాలో రికార్డ్ కలక్షన్స్ సాధించింది.


ఇప్పటివరకు అనుష్క కెరియర్ లో ఎన్నడు లేని విధంగా భాగమతి మిలియన్ మార్క్ దాటేసింది భాగమతి సినిమా. ఇక ఈ సినిమాకు ముందు అనుష్క చేసిన రుద్రమదేవి సినిమా 9.71 లక్షల డాలర్స్ తో ముందుంది.. భాగమతితో అది సెకండ్ ప్లేస్ లో నిలిచింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా చరిత్ర సృష్టించొచ్చు అని అనుష్క మరోసారి ప్రూవ్ చేసింది.


ఎలాంటి అంచనాలు లేని భాగమతి సినిమా టీజర్ తో కాస్త పాజిటివ్ బజ్ ఏర్పరచుకుంది. ఇక ముఖ్యంగా అమెరికాలో వన్ మిలియన్ మార్క్ అందుకోవాలంటే అక్కడ ప్రేక్షకుల మెప్పు పొందాలి. భాగమతితో ఆ ఫీట్ సాధించిన అనుష్క తనకు తిరుగులేదని నిరూపించుకుంది. సైజ్ జీరో తర్వాత ఫాం తగ్గినట్టు కనిపించినా భాగమతితో మళ్లీ తిరిగి ఊపందుకుంది అనుష్క.


ఇక ఈ సినిమా తర్వాత ఆమెపై మరింత బాధ్యత పెరిగిందని చెప్పొచ్చు. అనుష్క నట విశ్వరూపం చూపించిన ఈ భాగమతి తెలుగులో ఈ ఇయర్ మొదటి సూపర్ హిట్ బొమ్మ అంటే నమ్మాల్సిందే. ఈ సినిమా అంచనాలను అందుకోవడంతో కలక్షన్స్ మరింత పెంచుకునేందుకు విజయాత్ర ప్రారంభించారు భాగమతి అండ్ టీం.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: