హాట్ టాపిక్ గా మారిన లావణ్య త్రిపాఠి జాతకం !

Seetha Sailaja
లావణ్య త్రిపాఠికి ఎదురౌతున్న కష్టాలను చూసి ప్రస్తుతం ఇండస్టీ వర్గాలు కూడ షాక్ అవుతున్నాయి. ‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ సొట్టబుగ్గల సుందరికి అవకాశాలు బాగానే వచ్చాయి. ముఖ్యంగా నానీతో ఈమె నటించిన ‘భలే భలే మగాడివోయ్’ నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయన’ వరస హిట్స్ గా మారడంతో ఈమె కోసం టాలీవుడ్ ఇండస్ట్రీ దర్శక నిర్మాతలు అంతా ఎగబడ్డారు. 

అయితే ఆ తరువాత వచ్చిన సినిమాలు అన్నీ వరస ఫెయిల్యూర్ లుగా మారడంతో ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ ఐరన్ లెగ్ బ్యూటీల వరసలో లావణ్య త్రిపాఠీ అగ్రస్థానానికి చేరిపోయింది. శర్వానంద్ తో నటించిన ‘రాధ’ నాగ చైతన్యతో నటించిన ‘యుద్ధం శరణం’ సినిమాలు ఆమెని గట్టెక్కించ లేకపోయాయి. దీనికితోడు ఆమె మెగా యంగ్ హీరోల పై పెట్టుకున్న అంచనాలు కూడ తారుమారయ్యాయి. 

వరుణ్ తేజ్ తో నటించిన ‘మిస్టర్’ పరాజయంతో పాటు ఆమె ఎన్నో అంచనాలు పెట్టుకుని భారీ ఎక్స్ పోజింగ్ చేసి నటించిన సాయి ధరమ్ తేజ్ ‘ఇంటలిజెంట్’ కూడ ఘోరమైన ప్లాప్ గా మారడంతో అసలు ఈమెకు అదృష్టాన్ని ఇవ్వగల హీరో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా ? అంటూ సెటైర్లు పడుతున్నాయి. ఈసినిమాల మధ్యలో ఆమె హీరో రామ్ తో నటించిన ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ కూడ ఘోరమైన ఫ్లాప్ గా మారింది. 

దీనితో అటు మెగా యంగ్ హీరోలు ఇటు యంగ్ హీరోలు అందరూ లావణ్య త్రిపాఠి పేరు చెపితే భయపడే రేంజ్ కి ఈమె ఇమేజ్ పడిపోయింది. నటిగా తన పాత్రను అర్ధం చేసుకుని బాగా నటిస్తుంది అని పేరున్నా ఈమెకు వరసపెట్టి వస్తున్న ఈ ఫెయిల్యూర్స్ పీడకలగా మారడమే కాకుండా ఆమె కెరియర్ కు చరమగీతం పాడే వార్నింగ్ బెల్స్ ను మోగించే స్థితికి చేరుకున్నాయి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎక్స్ పోజింగ్ విషయంలో ఈమె ఎటువంటి హద్దులు పెట్టుకోకుండా సహకరిస్తున్నా ఈమె గ్లామర్ ను చూడటానికి తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి కనపరచకపోవడం ఆమె దురదృష్టం అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: