సునీల్ లవర్ తో బన్నీ రొమాన్స్...!
సునీల్ లవర్ అంటే ఇషాచావ్ల కాదు ఈ హీరొయిన్ మరొక అమ్మాయి హీరో సునీల్ తో ‘మర్యాదరామన్న’ సినిమాలో నటించి తరువాత పెద్దగా అవకాశాలు లేక తెరమరుగైపోయిన హీరోయిన్ సలోని పేరు చాలామంది మరిచిపోయారు. కానీ హటాత్ గా ఈమె మళ్ళీ వార్తలలోకి వచ్చింది. అల్లుఅర్జున్ హీరోగా సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ‘రేసుగుర్రం’ సినిమాలో సలోని ట్రెడిషనల్ లుక్ ఉండే సెకండ్ హీరొయిన్ ఛాన్స్ కొట్టేసిందట.
ఈ వార్తలను సలోని కూడా ద్రువపరచడమే కాకుండా బన్నీతో నటించడం తనకు చాల గర్వంగా ఉంది అని అన్నది. బన్నీతో నటించడానికి ఎంతోమంది హీరోయిన్స్ క్యూ కడుతూ ఉంటే ఈ చాన్స్ సలోని కొట్టేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. శ్రుతిహాసన్ మెయిన్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల అవుతుంది అంటున్నారు. ఈసినిమా అయినా సలోనికి బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి....