మహేష్, బన్ని ఓకే.. 'అర్జున్ రెడ్డి' విజయ్ పోటీకి రెడీ..!

shami
ఇన్నాళ్లు మహేష్, బన్ని సినిమాలు ఒకేరోజు బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధమవగా.. ఎలాగోలా ఆ డీల్ సెట్ చేసుకున్నారు. మహేష్ భరత్ అనే నేను ఏప్రిల్ 20న వస్తుండగా.. బన్ని నా పేరు సూర్య మే 4కి పోస్ట్ పోన్ చేశారు. రెండు చిత్రాల నిర్మాతలు చర్చల అనంతరం ఈ ఫైనల్ రిలీజ్ డేట్లు బయటకు వచ్చాయి. 


ఇక ఇదంతా బాగానే ఉంది కాని ఈమధ్యలో అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న ట్యాక్సీ వాలా సినిమా మే 18న రిలీజ్ ఫిక్స్ చేశారు. అర్జున్ రెడ్డితో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ ట్యాక్సీ వాలాగా అదరగొట్టబోతున్నాడు. ముఖ్యంగా బన్ని సినిమాకు పోటీగా మే 18న వస్తున్నాడు.   


మహేష్, కొరటాల శివ కాంబోలో శ్రీమంతుడు తర్వాత వస్తున్న సినిమా భరత్ అనే నేను. ఏప్రిల్ 27న రిలీజ్ అనుకున్న ఈ సినిమా కాస్త ప్రీ పోన్ అయ్యి ఏప్రిల్ 20కి ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమాకు విజయ్ పోటీ వచ్చే అవకాశం లేదు. ఇక మరో పక్క మహేష్, అల్లు అర్జున్ లకు విజయ్ ఏమాత్రం పోటీ కాదని అంటున్నారు.           


ఒక్క అర్జున్ రెడ్డి హిట్ కొట్టినంత మాత్రాన విజయ్ కు స్టార్స్ తో పోటీ పడేంత సీన్ లేదని కొందరు అంటున్నారు. అయినా సరే మే 4న బన్ని సినిమా అంటే ఎలా లేదన్నా రెండు వారాలు గ్యాప్ వచ్చినట్టే. మొత్తానికి స్టార్స్ తో సై అంటున్న విజయ్ ట్యాక్సీవాలా జోష్ చూస్తుంటే ఇది కూడా హిట్ కొట్టేలా ఉన్నాడు. యువి, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా రాహుల్ సంక్రుత్యన్ డైరక్షన్ లో వస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: