భారతీయ సిని ప్రపంచంలో తన పేరుని సువర్ణక్షరాలతో లిఖించబడేలా చేసుకుని.. కోట్లమంది హృదయాలను ఆరాధ్యులుగా చేసుకున్న శ్రీదేవి అనంతలోకాలకు వెళ్లారు. ఆమె మరణించిన వార్త విని సినిమా లోకమే కాదు అభిమాన గళం మూగబోయింది. శోక సముద్రంలో ఆమెని కడసారి చూసేందుకు ముంబై తరలి వెళ్తున్నారు అభిమానులు.
నిన్న రాత్రి ముంబైకి చేరుకున్న ఆమె మృతదేహం ఈరోజు మధ్యాహ్నం వరకు ప్రజల సందర్శనార్ధం ఉంచుతారు. 3 గంటల సమయంలో అంత్యక్రియలు జరుపుతారని తెలుస్తుంది. ఇక సినిమాల్లో హీరోలకే డూప్ లు ఉండే వారు కాని హీరోయిన్స్ కు తక్కువ. వారు యాక్షన్ సీన్స్ చేయరు కాబట్టి వారికి డూప్ అవసరం ఉండదు.
కాని శ్రీదేవికి ఒక సినిమాలో డూప్ అవసరం వచ్చిందట. రాఘవేంద్ర రావు తీసిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో అంమ్రీష్ పురి వస్తున్న సమయంలో కొలనులో ఉండే సీన్ ఉంటుంది. ఆ సీన్ లో శ్రీదేవికి ఈత రాదని ఆమె డూప్ గా హేమను ఉంచారట. హేమ ఆ విషయాన్ని ఎన్నోసార్లు వెళ్లడించింది.
ఆ సినిమాలో నటించిన హేమ ను డూప్ గా పెట్టి లాంగ్ షాట్ లో ఎలాగోలా మేనేజ్ చేశారు దర్శక నిర్మాతలు. శ్రీదేవికి ఈత రాదని తెలుసుకుని ఈ ఎరేంజ్ మెంట్స్ చేశారట. ఇప్పుడు శ్రీదేవి బాత్ టబ్ లో దెబ్బతగిలి మరణించినట్టు చెబుతుటున్నారు. మొత్తానికి అప్పుడు డూప్ తో తప్పించుకున్న శ్రీదేవి జల గండం నుండి తప్పించుకోలేకపోయిందని అంటున్నారు.