పాలమీగడ సౌందర్యం నటి తమన్నా భాటియా కి బాలీవుడ్ తో పాటు దక్షిణ భారతమంతా చుట్టెయ్యాలని ఉందనుకుంటా. ఇప్పటికే కోలీవుడ్, టాలీవుడ్ లను ఒక పట్టు పట్టిందీ వయ్యారిభామ. ఈ ముంబై బ్యూటీ కి ఇప్పుడు టాలీవుడ్ లో చేతి నిండా అవకాశాలు ఉన్నా, కోలీవుడ్ లో ఈమె వెలుగులు తగ్గు ముఖం పట్టాయనే చెప్పాలి. ఇక్కడ "కన్కే కలై మానే" అనే ఒకే ఒక్క సినిమాలో నటిస్తోంది.
"ఆడదాని ఓరచూపులో అయ్యారె ఓడిపోని ధీరుడెవ్వడు" అసలే తమన్నా ఆపై ఓరచూపు ఇంకేం పునీత్ ఫినిష్ ప్రస్తుతానికి శాండల్ వూడ్ రాసిచ్చేశాడు.
అలాగే హిందీ లో ఒకటి, మరాఠి లో ఒక్క సినిమా చేస్తున్న తమన్నా ఇంత వరకూ శాండిల్-వుడ్, మాలీవుడ్లను మాత్రం ఎందుకో వదిలేసింది. అయితే ఆ బాషా చిత్రాల్లో నటించాలన్న కొరిక మనసు లో ఉన్నట్లుంది. తన ఆశను చెప్పకనే చెప్పేసింది. విషయం ఏమిటంటే ఈ మిల్కీ బ్యూటీ ఇటీవల కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ తో కలిసి ఒక వాణిజ్య ప్రకటనలో నటించింది. ఆ సందర్భంగా పునీత్ రాజ్‌కుమార్ తో కలిసి నటించడం సంతోషం గా ఉందని విలేకరుల తో ముచ్చటిస్తూ చెప్పింది.
దీనికి స్పందించిన ఒక విలేకరి కన్నడ చిత్రాల్లో నటించే ఆలోచన లేదా? అని ప్రశ్నించడం తో అలాంటి ప్రశ్న కోసమే నిరీక్షిస్తున్న తమన్నా కన్నడ సినిమాల్లో (శాండల్ వుడ్) నటించాలని తనకూ ఉందని, అయితే అందుకు తనకొక షరతు ఉంటుందని ఒక చమక్కు విసిరింది అసలే జాణ కదా! ఏమిటా నిబంధన? అన్న ప్రశ్నకు తాను పునీత్ రాజ్‌కుమార్ తో అయితేనే నటిస్తానని చెప్పి, ఆయన స్పందన కోసం నిరీక్షిస్తుండగానే - పక్కనే ఉన్న పునీత్ రాజ్ కుమార్ "కన్నడ చిత్ర పరిశ్రమ లోకి మీకు స్వాగతం" అని ఆహ్వానించక తప్పలేదు.
మొత్తం మీద తన ఒక సమాధానమే మంచి ఎత్తుగడగా పని చేసి తనకు కొత్త ఏరియాలో ప్రవేశానికి అవకాశం దొరికినందుకు తమన్నా చిరునవ్వులు చిందించింది. సో, త్వరలోనే ఈ బ్యూటీ పునీత్ రాజ్‌కుమార్ తో కలిసి ఒక కన్నడ చిత్రంలో నటించే అవకాశం ఉందనే ప్రచారం దీంతో జోరందుకుంది.