స్వీటీ అనుష్కా షెట్టి కొత్త చిత్రం గౌతం మీనన్ దర్శకత్వం లో



బాహుబలి & బాహుబలి-2 చారిత్రాత్మక కాల్పనిక చిత్రాల్లో దేవసేన పాత్ర లో నటించిన విఖ్యాత కథానాయకి అనుష్క షెట్టి ఖ్యాతిని శిఖరాగ్రానికేగాదు ఖండాంతరాలకు వ్యాపించింది. ఆమెకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అసంఖ్యాక అభిమాను లను సంపాదించి పెట్టింది. ప్రస్తుతం స్వీటీ అనుష్కను ఒక సినిమాకు ఒప్పించాలంటే మామూలు విషయం కాదంటున్నారు. ఆమె ఇమేజ్‌ కు అనుగుణమైన కథను తయారు చేసుకోవడంతో పాటు అది ఖచ్చితంగా "మహిళా ప్రధాన ఇతివృత్తం" గా వుండా లని చెబుతున్నారు. అరుందతి, పంచాక్షరి, రుద్రమదెవి, వెదం, సైజ్ జీరో ఇలాంటి మహిళా ప్రథాన ఇతివృత్తాల్లో నటించిన అనుష్క తెలుగు జన హృదయ సామ్రాఙ్జి గా మారిపోయింది.

ఈ కారణంగానే బాహుబలి-2 తర్వాత స్వీటీ మరే కొత్త చిత్రం లోనూ నటించటానికి అంగీకరించలేదట. ఇటీవలే విడుదలైన "భాగమతి" చిత్రాన్ని బాహుబలి-2 కంటే ముందే అంగీకరించడంతో ప్రేక్షకులు దానిని కొత్త సినిమా గా భావించలేదు. అయినా భాగమతి కూడా మహిళా ప్రధానంగా ఉండటం కొంతవరకు ఆమె తృప్తి మేరకు విజయం సాధించింది. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో అనుష్క నటించటానికి ఒక సినిమాకు అంగీకరించినట్లుగా తెలిసింది. 

మహిళా ప్రధాన ఇతివృత్తం తో, తనదైన శైలి భావోద్వేగభరిత అంశాలతో గౌతమ్‌ మీనన్ చెప్పిన కథ అనుష్క ను బాగా ఆకట్టుకుందని అంటున్నారు. రాబోవు రెండు మూడు మాసాల్లో ఈ సినిమాను సెట్స్‌ మీదకు తీసుకొచ్చేందుకు గౌతమ్‌ మీనన్ సన్నాహాలు చేస్తున్నారని చెన్నై సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం. ప్రస్తుతం విక్రమ్ కథానాయకుడిగా ధృవనక్షత్రం చిత్రాన్ని రూపొందిస్తున్నారు గౌతమ్‌ మీనన్. ఈ సినిమా పూర్తయిన వెంటనే అనుష్కషెట్టి కథానాయికగా నటించే చిత్రాన్ని ప్రారంభిస్తా రని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: