రాజమౌళి వార్నింగ్ ను బయటపెట్టిన చరణ్ !

Seetha Sailaja
మరో మూడు రోజులలో విడుదల కాబోతున్న ‘రంగస్థలం’ మూవీని చరణ్ చాల గట్టిగా ప్రమోట్ చేస్తున్నాడు. ఈ సందర్భంలో ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘రంగస్థలం’ మూవీ గురించి అనేక విషయాలు చెపుతూ తాను ఇంటర్వ్యూకు బయలుదేరే ముందు రాజమౌళి దగ్గర నుండి వచ్చిన ఒక వార్నింగ్ విషయాన్ని బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు.

‘రంగస్థలం’ ఇంటర్వ్యూలో ఎవరైనా తన మల్టీ స్టారర్ గురించి చరణ్ ను ప్రశ్నలు అడిగితే ఎటువంటి సమాధానాలు ఇవ్వవద్దు అని తనకు రాజమౌళి వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని తెలియచేసాడు. అయితే తనకు రాజమౌళి తీయబోయే ఈ మల్టీ స్టారర్ కథ ఏమిటో తనకు కూడ తెలియని నేపధ్యంలో రాజమౌళి మల్టీ స్టారర్ గురించి ఎటువంటి లీకులు ఇవ్వగలను అంటూ చరణ్ రాజమౌళితో జోక్ చేసిన విషయాన్ని బయటపెట్టాడు.

రాజమౌళి తీయబోతున్న మల్టీ స్టారర్ లో తన పాత్ర ఏమిటో తనకే కాదు జూనియర్ కు కూడ తెలియదు అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు చరణ్. ఇది ఇలా ఉండగా ఈసినిమాకు సంబంధించి కొద్ది రోజుల క్రితం వచ్చిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ విషయం ఈసినిమాను నిర్మిస్తున్న డివివి దానయ్యకు కూడరాజమౌళి ముందుగా తెలియచేయలేదు అన్న వార్తలు ఉన్నాయి.

సుమారు 200 కోట్ల భారీ బడ్జెట్ తో తీయబోతున్న ఈసినిమాకు సంబంధించిన హింట్స్ ఈసినిమాలో నటిస్తున్న హీరోలకే కాదు భారీ పెట్టుబడి పెడుతున్న ఈమూవీ నిర్మాతకు కూడ తెలియకుండా ఈమూవీకి సంబంధించి ఈమధ్య రాజమౌళి రిలీజ్ చేసిన వీడియో కూడ అంతా రాజమౌళి టీమ్ చేత తయారు చేయించి ఈమూవీ నిర్మాతకు కేవలం ఒక గంట ముందు మాత్రమే పంపించి దానయ్యకు కూడ రాజమౌళి షాక్ ఇచ్చినట్లు టాక్. దీనితో 200 కోట్ల పెట్టుబడి పెట్టే నిర్మాత కూడ రాజమౌళి ముందు సార్ సార్ అనడం తప్ప ఏమిచేయగలడు అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: