‘భరత్’కు ఏపీలో ‘ప్రత్యేక హోదా’ సెగ..!?

Vasishta

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా భరత్‌ అనే నేను. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌  షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్‌ లో ఎమోషన్  పెంచింది ఆ సినిమా యూనిట్. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఓ రేంజ్ లో జరిపి ఆడియన్స్ లో అటెంక్షన్ పెంచాలనే ప్లాన్ లో ఉంది.


‘భరత్ అనే నేను’ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో నడిచే సినిమా.. అందుకు తగ్గట్లే ఈ సినిమా ఆడియో వేడుక వ్యవహారం కూడా థ్రిల్లర్ లా సాగుతోంది. ఈ వేడుక ఎక్కడ నిర్వహిస్తారనే విషయంపై వారం రోజులుగా రసవత్తర డ్రామా నడుస్తోంది. ముందు విశాఖపట్నంలో ఈ వేడుక చేయాలని అనుకున్నారు. కానీ అక్కడ చేస్తే ప్రత్యేక హోదా నినాదాలు గట్టిగా వినిపిస్తాయని వేదికను విజయవాడకు మార్చాలనుకున్నారు.. కానీ అక్కడ కూడా ఇబ్బందులు తలెతే ఛాన్స్ ఉందటంతో మళ్లీ ఆలోచనలో పడింది ఫీల్మ్ టీం.


భరత్ అనే నేను’ ఆడియో ఈవెంట్‌ను ఏప్రిల్ 7న హైదరాబాద్‌లో నిర‍్వహించాలని ఫిక్స్‌ అయ్యాడట కొరటాల శివ. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఆడియో వేడుక జనాల మధ్య పెద్ద ఎత్తునే చేయాలని డిసైడ్ అయ్యారట. ఆడియో వేడుక కోసం అసెంబ్లీని తలపించే విధంగా సెట్టింగ్ కూడా వేయబోతున్నారట. అందుకే ఎల్బీ స్టేడియాన్నే వేదికగాఎంచుకున్నట్లు తెలుస్తోంది.


ఎలా చూసినా భరత్ అనే నేను మూవీ.. మహేష్ కెరీర్ కి చాలా కీలకంగా మారింది. ఈ సినిమా రిజల్ట్ పైనే తన ఫ్యూచర్ డిసైడ్ అయ్యింది. అందుకే స్టోరీ నుంచి ప్రమోషన్ వరకు ప్రతిదీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. ఎక్కడా ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.


ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్, టీజర్ పేలడంతో ఈ సినిమాపై అంచనాలు ఎవరెస్ట్ ఎక్కాయ్. మరి ఫ్రీరిలీజ్ ఈవెంట్ ఓ రెంజ్ లో చేసి మరింత అటెంక్షన్ పెంచాలనే ప్లాన్ లో ఉంది ఆ ఫీల్మ్ టీం. మరి ఏప్రిల్ 20న వస్తున్న ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో .. ఆడియో ఫంక్షన్ ఎంతవరకు ప్లస్ అవుతుందో వేచి చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: