తమన్ లీక్ చేసిన TTT లుక్.. ఫ్యాన్స్ సర్ ప్రైజ్..!

shami
ఓ పక్క బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా RRR అంటూ ప్రమొషన్ మొదలు పెట్టగా. ఆ సినిమాలో ఎన్.టి.ఆర్ ను కాస్త రామారావు చేసి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ చేశాడు. ఇక ప్రస్తుతం ఎన్.టి.ఆర్ చేయబోతున్న త్రివిక్రం సినిమాలో ఎన్.టి.ఆర్ ను తారక్ అని సంభోదిస్తూ TTT కాన్సెప్ట్ చెబుతున్నాడు సినిమా మ్యూజిక్ డైరక్టర్ తమన్.


ఈ RRR ఇంకా TTT (త్రివిక్రమ్, తారక్, తమన్)గోల ఏంటో గాని ఫ్యాన్స్ మాత్రం కాస్త కన్ ఫ్యూజన్ లో ఉన్నారన్నది నిజం. ఇక త్రివిక్రం సినిమా కోసం బాగా వర్కవుట్స్ చేస్తున్న ఎన్.టి.ఆర్ త్రివిక్రం తో స్టార్ మా యాడ్ షూట్ లో కనిపించి కనిపించకుండా ఉన్న లుక్ బయటకు వచ్చింది. తారక్ సన్నబడినట్టు తెలుస్తున్నా అది కరెక్ట్ గా కనిపించలేదు. 


అయితే తమన్ ఏకంగా ఎన్.టి.ఆర్, త్రివిక్రం లతో దిగిన సెల్ఫీ ఒకటి తన ట్విట్టర్ లో పెట్టాడు. అందులో ఎన్.టి.ఆర్ సన్నబడినట్టు పక్కాగా తెలుస్తుంది. సినిమా కోసం దాదాపు 15 కిలోల దాకా వెయిట్ లాస్ అయ్యాడట ఎన్.టి.ఆర్. ఇది నిజంగానే గొప్ప విషయమని చెప్పొచ్చు. బరువు పెరగడం తగ్గడం తారక్ కు అలవాటే కాని వెంట వెంటనే అంటే అది తనకే సాధ్యమైంది.


త్రివిక్రం సినిమాలోనే కాదు చేయబోయే రాజమౌళి సినిమాలో కూడా ఎన్.టి.ఆర్ హ్యాండ్సం లుక్ లో కనిపిస్తాడట. త్రివిక్రం సినిమా ఈ నెల సెకండ్ వీక్ లో స్టార్ట్ అవుతుండగా ఇది త్వరగా పూర్తి చేసి సెప్టెంబర్ నుండి రాజమౌళి సినమాకు వర్క్ చేయాల్సి ఉందట ఎన్.టి.ఆర్. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: