మెగా నందమూరి కాంబినేషన్ లో సినిమా అంటేనే ఆ రేంజ్ ఏంటన్నది అర్ధం చేసుకోవచ్చు. అది కూడా బాహుబలి తర్వాత రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, చరణ్ కలిసి సినిమా చేస్తున్నారు అంటే ఆ లెక్క వేరేలా ఉంటుంది. అసలే వరుస విజయాలతో దూసుకెళ్తున్న తారక్ తో పాటుగా ధ్రువ సక్సెస్ తో పాటుగా రంగస్థలంతో రచ్చ చేసిన రాం చరణ్ మంచి ఫాంలో ఉన్నారు.
అయితే ఈ ఇద్దరు రాజమౌళి సినిమా గురించి అడిగితే మాత్రం చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు. మొన్నామధ్య చరణ్ కూడా ఇంకా పూర్తి కథ వినలేదని అన్నాడు. ఇక నిన్న వివో ఐపిఎల్ ప్రెస్ మీట్ లో ఎన్.టి.ఆర్ కూడా చరణ్ ఏం చెప్పాడో నాది అదే సమాధానం అన్నాడు. కాస్తైనా కొత్తగా లేకుండా చెప్పాడు.
ఇంకాస్త క్లారిటీ కావాలని అడిగే సరికి సినిమా గురించిన పూర్తి వివరాలు రాజమౌళి చెబుతారని అన్నాడు. అయితే సినిమా మాత్రం హెల్దీ కాంపిటీషన్ గా ఉంటుందని.. నువ్వా నేనా అన్న తీరులో కథ నడుస్తుందని అన్నాడు. కేవలం మా ఇద్దరి ఇమేజ్ లే కాకుండా రాజమౌళి మార్క్ కూడా ఉంటుందని చెప్పాడు.
ఇప్పటికే RRRతో అభిమానులు ఉత్సాహంగా ఉంటుంటే ఇప్పుడు ఇద్దరు హీరోలు నువ్వా నేనా అంటూ ఫైటింగ్ ఉంటుందని చెప్పాగా సినిమా మీద మరింత అంచనాలు పెంచేసుకుంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రం సినిమా కోసం సిద్ధమవుతున్న ఎన్.టి.ఆర్ ఐపిఎల్ యాడ్ లో కనిపించి మురిపించాడు.