శ్రీరెడ్డి త్యాగం ఊరికే పోగూడదు - ఆ పునాదులపై నూతన చిత్రసీమ నిలబడాలి

ఒక సామాజిక వర్గం సమాజం మీద గత నాలుగు దశాబ్ధాలకు పైగా తన అధికార దురహంకార పంజా విసురుతోంది. అనకొండ లా సమాజాన్ని కమ్మేస్తుంది. ఒక ప్రక్క సినిమా పరిశ్రమ, మరో ప్రక్క సమాచార మాద్యమం, ఇంకో ప్రక్క రాజకీయ రంగంపై కొరడా ఝుళిపిస్తూ పరిపాలన చేస్తున్నారు. అన్నింటిని మించి రాష్ట్ర పారిశ్రామిక రంగంపై మంచి పట్టు బిగించింది.



ప్రభుత్వంలో ఆధిపత్యం వహిస్తున్న వారికి అంతెవాసులుగా మారి కాంట్రాక్టులన్నీ చేజిక్కించుకొంటూ ఉన్నారు. అంతేకాదు విపరీత పదవీ లాలస, అధికార దుర్మధాందత విచ్చలవిడిగా నాట్యం చేస్తున్నయి. అన్ని రంగాలపై ఆధిపత్యమున్న ఆ సామాజిక వర్గం నేడు కావలసినంత సంపద, మౌలిక సదుపాయాలు, రాష్ట్రంలోని అత్యున్నత పదవులు, స్థాయిని అనుభవి స్తున్నారు.


ఉదాహరణకు సినీ రంగం తీసుకుంటే ఈ మద్య శ్రీరెడ్ది అనే అమ్మాయి ఆ సినీ రంగంలోని అన్యాయాలపై ముఖ్యంగా మహిళ ల కోసం చేసిన తిరుగుబాటు అభినందించ తగినదే. మొదట ఆమె స్వంత సమస్య పై పోరాడినా అది  క్రమంగా అది సినిమా పరిశ్రమలో దశాబ్ధాలుగా మహిళలపై కొనసాగిస్తున్న దురాగతాల, సామాజిక సమస్య పై పోరాటమే అయింది.  అనేక మంది కరాటే కల్యాణి, సత్యా చౌదరి లాంటి వాళ్లని ప్రక్కన బెట్టేసేయాలి. అలాగే రాంకీ లాంటి వాళ్లు చెప్పే సొల్లు కబుర్లు ర్లతో అంతె వాసులుగా ఉంటారుతప్ప  ప్రయోజనకరమైన పనులు చేయలేరు.


అసలు శ్రీరెడ్ది ఆ రకమైన ప్రయోగం చేయకపోతే - దశాబ్ధాలుగా దగ్గుబాటి కుటుంబమే కాదు అలాంటి నాలుగైదు కుటుంబాలు చిత్రపరిశ్రమపై తమ కాలనాగు పడగను విప్పి పంజా విసిరి వేరే సామాజిక వర్గాలకు అవకాశమే లేకుండా చేశారు.


పోనీ చిరంజీవి లాంటి నటుడు కూడా సినీ రంగంలో నిలదొక్కుకొని ఆ కష్టాలను భరించి సాధించినా, ఒక వర్గపు కంచుకోటల ను బ్రద్ధలు కొట్టి కొత్త నీరులావచ్చి ఆ సమాజంలోకి ఇతరవర్గాల ప్రవేశం సుగమం చేశాడనుకుంటే ఆయన కూడా ఆ వర్గంలో బాగమై పోయారు. అంతేకాదు వెరే వర్గాలకు ఆ పరిశ్రమలో అవకాశాలు రాకుండా చేస్తూ తన "చిరంజీవి  మంద టాలీవుడ్  చిత్ర పరిశ్రమకే గుదిబండ"  గా మారారు.


శ్రీరెడ్దిని ప్రముఖ నిర్మాత టాలీవుడ్ మూలస్థంబాల్లో ఒకరైన సురేష్ బాబు రెండవ కొడుకు మోసం చేసినది క్షమించరాని. నేఱం. అంతే కాకుండా "మూవీ ఆర్టిష్ట్ అసోసియేషన్" (మా) వారికే వత్తాసు పలకటం అక్కడ న్యాయం  చచ్చిపోయినట్లే నని భావించాల్సి వస్తుంది. ఇక్కడ కారాటే కళ్యాణి సురెష్ బాబు కుటుంబానికి రక్షణగా ఉన్నట్లు కనిపిస్తుంది. 



శ్రీరెడ్డి త్యాగం ఊరికే పోగూడదు - ఆ త్యాగం పునాదులపై ఒక నూతన వ్యవస్థగా చిత్రసీమ నిలబడాలి. చిరంజీవి ఆయన కుటుంబం చేయలేని పని ఒక అమ్మాయి తెగించింది.



దైహికంగా ఆమే అర్థనగ్నంగా నిలబడ్డా, మానసికంగా ఆమే సరైన దుస్తులతోనే ఉంది నిండైన రూపమే. ఇంత జరిగాక ఆమె రూపం ఇప్పుడు నగ్నమనిపించటం లేదు ఆమె త్యాగం వృధా పోగూడదు. ఇప్పుడు గనక దాసరి నారాయణరావు గారు బ్రతి కుంటే పరిస్థితులు సాంఘిక ప్రయోజనాల దిశగా శ్రీరెడ్డిని సరిగా నడిపించి ఉండేవారు. ఆలోపం ఇప్పుడు ప్రస్పుటంగా కనిపిస్తుంది.

“శ్రీరెడ్డి వల్ల పదిమందికి మేలు జరిగితే మాకు సంతోషమే....ఇంత జరిగినా ఆమె తలి పుష్పవతి స్పందన అపూర్వం” కాస్టింగ్ కౌచ్ నేడు మన సామాజంలో సంచలనం. ఇది గతంలో లేదని కాదు రేపు ఉండదని కాదు. కాస్టింగ్ కౌచ్ కు గురైన వారు దాని నుండి ప్రతిఫలం పొందకపోతే అది సమస్య,  పొందితే ఒక మంచి కథానాయిక లేదా నటి ఉద్భవించవచ్చు అపుడెవరూ సమస్య చేయరు. ఙ్జానపీఠ్ అవార్డ్ గ్రహీత రచన "పాకుడురాళ్ళు" నవలలో రావూరి భరద్వాజ గత నాలుగు దశాబ్ధాల క్రితం ఎప్పుడో ఈ కాష్టింగ్ కౌచ్ గుఱించి ప్రస్తావించారు. తెలుగు చిత్రసీమలో కొందరు పెద్దలు తమ ఇష్టారాజ్యాన్ని నాడెప్పటి నుండో నడిపిస్తూ వస్తున్నారు. ఆ రంగంలోని కీర్తి, కాంత, కానకాలు వారి పాదాక్రాంతమయ్యాయి. 


నార్కోటిక్స్ కేసులో బయటకు రాని ఒక పెద్ద సినీ కుటుంబ సభ్యులు


ఈ రంగంలో విజయవంతమైన "క్విడ్ ప్రోకో" అంటే నన్ను ఈ రంగంలో నిలబెట్టండి దానికి ఆసరా లేదా మద్దతు నివ్వండి అందుకు ముందు గానే మీకు నూతన అనుభవం ఇస్తాను అనేది అమాయిలతో చేసుకునే ఎగ్రిమెంట్. 



ఈ 'క్విడ్ ప్రోకో'  ట్రాన్సాక్షన్లో ఒక పాట్రాన్ పోష్టై రెండో పాట్రాన్ పోష్ట్ కాకపోతే పనికి ఆటంకమై సమస్య అవుతుంది. అప్పుడు ఆ ప్రయోజనం పొందనివారు పొందినవారిపై నిశ్శబ్ధంగా పోరాడితే అది "పరోక్ష యుద్ధం" అవుతుంది. అలా కాకపోతే అల్లరై "ప్రత్యక్ష యుద్ధం" అవుతుంది. ఇప్పుడు శ్రీరెడ్డి అదే చేస్తుంది.  అది విజయవంతం కాకుండా కొందరు పెద్దలు ఇంకొందరు అంతెవాసులను ప్రవేశ పెట్టి నీరుగార్చే పనిచేస్తారు ఆపై అనేక రకాల పద్దతుల్లో సమాజంలో అలజడి సృష్టిస్తారు. 

ఆరుద్ర అన్నట్లు "ఆత్రేయ సమస్య మనుసు కైతే - సమాజం సమస్య శ్రీ శ్రీది"  అన్నట్లు ఈ శ్రీరెడ్డి సమస్య ఇప్పుడు "మా -మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్" సమస్యైంది, ఇంకా ఆలస్యమైతే ముఖ్యమంత్రి కెసిఆర్ కు సమస్య అయ్యెలాఉంది. దానికి సూచనగా నడిరోడ్డు పై అర్ధనగ్న ప్రదర్శన ఇచ్చింది.  అర్ధనగ్న ప్రదర్శన తప్పని ఘోషించే సిగ్గుదాచుకునే ఈ సినీ సమాజం ఆ కుళ్ళును ఇప్పటికైనా కడిగేసుకొనే ప్రయత్నం చేయకపోవటం విడ్డూరం. అన్నీ పాపాలకు జన్మస్థానం సినీ క్షెత్రమే. ఇక్కడి నుండే నాలుగుదశాబ్ధాల నుండి రాజకీయాల్లోకి కొత్త నీరు వచ్చి చేరింది. దానితోనే కుళ్ళు కుతంత్రం కూడా 


నార్కోటిక్స్, వ్యభిచారం, మోసం, దగా, గుత్తధిపత్యం లాంటి పైత్యాలన్నీ సినీ క్షేత్ర పితృ పితామహుల నుండి వారసత్వ సంపదగా జన జీవనంలోకి వచ్చి అన్నీ వ్యవస్థల్లో చేరి పేరుకుపోయాయి. ఒక్క సారి ఈ సినీ వ్యవస్థను ప్రక్షాళిస్తే సర్వం బాగుపడుతుంది.



అణచివేత నుండే ఉద్యమం పుడుతుంది - బహుశ శ్రీరెడ్డి ఆందోళనపై ముందుగనే  "మా" శ్రద్ధ పెట్టి ఉంటే పరిస్థితి ఇందాకా వచ్చేది కాదు.  ఒకవైపు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ శ్రీరెడ్డిని “మా” నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటింటం, ఆమెతో కలిసి 900 మంది సభ్యుల్లో ఎవరైనా నటీనటులు నటిస్తే అసోసియేషన్ లో వాళ్ల సభ్యత్వం కూడా రద్దు చేస్తామని హెచ్చరింటంతో,  ఫిల్మ్ ఛాంబర్ వద్ద అర్ధనగ్నగా తన నిరసన తెలిపిన నటి,  యాంకర్ శ్రీరెడ్డికి ఇప్పుడిప్పుడే పలు ప్రజాసంఘాల మద్దతు లభిస్తోంది. అర్ధనగ్న ప్రదర్శన ఉద్యమ రూపం దాల్చేలా ఉంది. ఇది వ్యవస్థ రీత్యా ఒక శుభపరిణామమే. 

ఈనేపథ్యంలో క్రమంగా శ్రీరెడ్డి ఆందోళనకు మద్దతుదారులు పెరుగుతున్నారు. “తెలంగాణ యూత్ ఫోర్స్”  "రాష్ట్ర మానవ హక్కుల కమిషన్"లో ఫిర్యాదు చేసింది. శ్రీరెడ్డి బతుకుదెరువు కోల్పోయేలా చేసిన “మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్” మీద సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తెలంగాణ యూత్ ఫోర్స్ ప్రధాన కార్యదర్శి బింగి రాములు ఫిర్యాదు చేశారు.



ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపిలకు ఆదేశాలివ్వాలని ఫిర్యాదులో కోరారు. 900 మంది సినిమా ఆర్టిస్టులకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అల్టిమేటం జారీ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు పిటిషనర్. ఆమె కిరాయికి ఉంటున్న ఇంటి ఓనర్ ను కూడా మా అసోసియేషన్ పెద్దలు బెదిరించడం మరీ దారుణం అని తెలిపారు. ఆమెను ఇల్లు ఖాళీ చేయించే ప్రయత్నం చేయడం బాధాకరమని పిటిషన్ లో తెలిపారు. మరోవైపు శ్రీరెడ్డి విషయంలో సినీస్టార్ శ్రీకాంత్ 
మా ట్లాడిన తీరు దారుణంగా ఉందని బింగి రాములు పిటిషన్ లో పేర్కొన్నారు. 


తెలంగాణ యూత్ ఫోర్స్ తరుపున రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో సీనియర్ అడ్వొకెట్ పొలిశెట్టి అరుణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మీద మానవ హక్కుల కమిషన్ ఏ రకంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.


"మా"  తీసుకున్న నిర్ణయం శ్రీరెడ్డి బతుకుదెరువును నాశనం చేయడమే అని ఆందోళన వ్యక్తం చేశారు. తన సమస్యల మీద, తన కష్టాల మీద "మా" కు నోటీసు ఇచ్చి తన సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించిన శ్రీరెడ్డిని ఇలా వెలివేయడం దారుణ మని పిటిషన్ లో పేర్కొన్నారు. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారి మీద శ్రీరెడ్డి ఫిర్యాదు చేస్తే, పట్టించుకోకుండా, కనీసం ఆమెను పిలిచి సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయకుండా ఏకపక్షంగా ఆమెపై వేటు వేయడం, అల్టిమేటం జారీ చేయడం దారుణమన్నారు. "మా" తీరు దగ్గుబాటి కుటుంబాన్ని కాపాడటమే లక్ష్యంగా పని చేస్తున్నట్లుంది. చింత చచ్చినా పులుపు చావనట్లు   అస్థిత్వం కోల్పోయిన "మా" ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు తనను తాను సరిదిద్దు కోవటం తప్ప,


ప్రభుత్వం నుండి భూములు మౌలిక సదుపాయాలు పోంది పరిశ్రమలొ వేలకోట్లు పోగేసుకున్న ఒక వర్గ సమాజం ఇంకా సినిమాలపై, ప్రదర్శన శాలపై, ప్రదర్శనశాలపై, థియేటర్లపై, నిర్మాతలు, దిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులపేరుతో సాగించే ధౌష్ట్యాన్ని ఆపేయాల్సిందే నని అంటున్నారు ప్రజలెప్పటి నుండో. దానికి విధి విధానాలు ప్రభుత్వమే రూపొందించా ల్సిన అవసరముంది.


మహిళల మానం ఇక్కడ అంగట్లో సరుకైన వేళ వారికోసం ఒక "మహిళా మా" ప్రభుత్వంలోని సినిమాటోగ్రఫి శాఖ అను భవఙ్జులైన ఐఏఎస్ అధికారుల ప్రమేయంతో ఏర్పరచాలి. దిశానిర్దేశం చేయాలి. లేకపోతే హీరో మహెష్ బాబు అన్నట్లు సినిమా రంగంలో నాలుగురైదుగురు హీరోలు మాత్రమే ఉన్నారు. సంవత్సరానికి ఒక్కొక్కడు ఒక్కో సినిమా చేసుకుంటూ పోతే చాలని అన్నట్లు ఆ నలుగురితోనే మనం వినోదం అందుకోవాలి. కొత్త నీరు రాదు ఈ నాలుగు కుటుంబాలు రానివ్వరు. ఎప్పుడూ ఆ నిమ్మకూరు ఈ మొగల్తూరు ఆ పాలకొల్లు తప్ప నవ్యత దొరకదు. మార్పు చాలా అవసరం. శ్రీరెడ్డిది ఒప్పా? తప్పా? అని కాదు, ఇక్కడ నుండే సమూల మార్పు రావటం అవసరం.


శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కోరుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారు తున్నాయి. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా ద్వారా సీఎంకు తన బాధను వ్యక్తపరిచింది. "కేసీఆర్ గారూ, మీరు మా బాధను అర్థం చేసుకోకపోతే, నిరాహారదీక్ష చేస్తా. గతంలో మీరు పోరాడి, విజయం సాధించిన మార్గాన్నే నేను ఎంచుకున్నా. మీరు ఇప్పటికీ స్పందించకపోతే, పబ్లిక్ లో నగ్నంగా నిలబడి నిరసన తెలుపుతా. దయచేసి మేల్కోండి సార్. మిమ్మల్ని ఎలా కలవాలో కూడా నాకు తెలియడం లేదు"  అని ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా తెలిపింది.

ఇక మన ముఖ్యమంత్రికి సచివాలయానికే వచ్చే తీరిక లేదు. ఇక ఈ సమస్య పరిష్కారం చేస్తారనే ఆ అమ్మాయి ముఖ్యమంత్రి ని కలసి సి ఎం ఓ  ను "రచ్చబండ"  చేయటం తధ్యం. అల్రడీ అనుకున్నట్లు అర్ధనగ్న ప్రదర్శన ఘట్టం ముగిసింది. అందోళనలు మిన్నంటాయి. టెలివిజన్ చానల్స్ రంగంలోకి దిగాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: