జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం ఈ రోజు ప్రకటించింది. ఉత్తమ చలన చిత్రంగా ప్రముఖ హీరో రాణా నటించిన ఘాజీ చిత్రం పురస్కారం దక్కించుకుంది. 65వ జాతీయ చలన చిత్రం అవార్డుల్లో... శ్రీదేవి నటించిన మామ్ సినిమాతో పాటు టాలీవుడ్ విజువల్ వండర్ బాహుబలి2 సినిమాలకు అవార్డుల పంట పండింది. అలాగే ఉత్తమ యాక్షన్ చిత్రంగా బాహుబలికి పురస్కారం దక్కింది.
ఉత్తమ గ్రాఫిక్ చిత్రంగా బాహుబలి-2 అవార్డును దక్కించుకుంది. రానా నటించిన ఘాజీ చిత్రం జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తెలుగులో మొదటిసారిగా సబ్ మెరైన్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఉత్తమ హిందీ చిత్రంగా ‘న్యూటన్’ కు పురస్కారం దక్కింది. ఈ అవార్డుల జాబితాను అవార్డుల కమిటీ అధ్యక్షుడు శేఖర్ కపూర్ ప్రకటించారు.అస్సామీ సినిమా ‘విలేజ్ రాక్ స్టార్స్‘జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక అయ్యింది.
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్(ఫిమేల్)గా నిలిచింది దివ్యాదత్తా. జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు నాగరాజ్ మంజులేకు దక్కింది. ఉత్తమ సంగీత దర్శకుడిగా నిలిచాడు ఏఆర్ రెహమాన్. మణిరత్నం సినిమా ‘కాట్రు వెలియిడై’కు గానూ రెహమాన్ ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు పొందాడు. అలాగే ‘మామ్’ బీజీఎంకు కూడా రెహమాన్ కు అవార్డు ప్రకటించారు.
అవార్డుల జాబితా :
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ : వినోద్ ఖన్నా
బెస్ట్ యాక్టర్(మేల్) -రిద్దీ సేన్(బెంగాలీ సినిమా నాగర్ కీర్తన్)
బెస్ట్ సింగర్ (మేల్)- కేజే యేసుదాస్
ఉత్తమ బాలల చిత్రం- మోర్క్య(మరాఠీ)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్-ఫవాద్ ఫాజిల్
బెస్ట్ ఫిమేల్ సింగర్- షాషా తిరుపతి(కాట్రు వెలియిడై)
బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్- వాటర్ బేబీ
బెస్ట్ ఫిల్మ్ ఆన్ సోషల్ ఇస్యూస్ – అయామ్ బొనే, వెల్ డన్ (రెండు సినిమాలు)
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే – భయానకం(మలయాళం)
బెస్ట్ షార్ట్ ఫిల్మ్(ఫిక్షన్)- మయ్యత్ (మరాఠీ)
బెస్ట్ కొరియోగ్రఫీ: గణేష్ ఆచార్య(టాయ్ లెట్ ఏక్ ప్రేమ్ కథ)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ -టేకాఫ్ (మలయాళం)
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్- బనితా దాస్(విలేజ్ రాక్ స్టార్స్)
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు- దివంగత నటుడు వినోద్ ఖన్నా
నర్గీస్ దత్ అవార్డు (జాతీయ సమైక్యతా చిత్రం)- దప్పా(మరాఠీ)