మరో కొత్త వివాదం లో కాటం రాయుడు పాట !

K Prakesh

పవన్ కళ్యాణ్ కాటం రాయుడి పాటలో దేవుళ్ళను కించ పరిచాడని వార్తలు వచ్చి అవి నెమ్మదిగా సర్దు  మణిగాయి. ప్రస్తుతం పవన్ ‘అత్తారింటి దారేది’ లోని కాటం రాయుడా పాటను వినే వారి సంఖ్య  లక్షల సంఖ్యలో పెరిగి పోతూ ఉంటే ఈ పాట కు మరో కొత్త వివాదం చుట్టుకుంది. గతం లో వచ్చిన ‘దేనికైనా రెడీ’ సినిమాలా ఈ పాటకు కూడా బ్రాహ్మణ సెగ తగిలింది. ఈ పాట ఫై కొన్ని బ్రాహ్మణ  సంఘాలు ఈ పాటలోని  ‘బాపనోళ్ళ చదువులు’ అనే పదం వాడిన విధానం ఫై మండి పడుతున్నారు.

ఇంతకి విషయం ఏమిటి అంటే ఈ పాటలో విష్ణు మూర్తి అవతారాలు అన్నీ వస్తాయి. బ్రహ్మ బ్రాహ్మణుల కే చదువు వచ్చేలా ఎందుకు చేసాడు అని చెపుతూ మత్స్యవతారం లో రాక్షసులను సంహరించిన తరువాత విష్ణువు వేదాలను బ్రాహ్మణులకు అప్ప చెపుతాడు, అంటే చదువులకు వారసులుగా బ్రాహ్మణులను ప్రకటించాడని అంటారు. ఈ భావం తోనే ఈ పాటలో బాపనోళ్ళ చదువులు అనే పదం వస్తుంది.

ఈ పదాన్ని పవన్ జానపద రీతి లో కొద్దిగా వెటకారంగా పాడాడు. ఈ విషయాన్ని కొంతమంది బ్రాహ్మణ వాదులు భూతద్దం లో చూస్తూ తమ మనో భావాలు దెబ్బ తిన్నాయి అంటూ  కొత్త వివాదం తెర పైకి తీసుకు వచ్చి ఆ పాటలో కొన్ని పదాలు తీసి వేయమని  ఆందోళన బాటపడుతున్నారట. విడుదలకు దారి ఏది అంటూ ఆగిపోయిన పవన్ అత్తారింటికి దారేది సినిమాలోని ఈ పాట ఫై రగులుతున్న వివాదం ఇంకా ఎన్ని మలుపులు తీసుకొంటుందో చూడాలి. మరి ఈ పాట దారి  ఎటు పోతుందో చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: