పవన్ కళ్యాణ్ పుస్తక పఠనం పై సెటైర్లు !

Seetha Sailaja
టాలీవుడ్ ఎంపరర్ గా కోట్లాది మంది అభిమానులు కలిగిన పవన్ కళ్యాణ్ విపరీతంగా పుస్తకాలు చదువుతాడని అతడి సన్నిహితులు చెపుతూ ఉంటారు. పవన్ వ్యక్తిగత లైబ్రరీలో వేల సంఖ్యలో పుస్తకాలు ఉంటాయి. అటువంటి పవన్ ఒక ప్రముఖ వ్యక్తి వ్రాసిన పుస్తకం పై కన్ఫ్యూజ్ అయి చెప్పిన విషయాలను బ్రిటన్ దేశంలోని కొందరు విద్యార్ధులు తప్పు పడుతూ పవన్ పై కామెంట్స్ చేయడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. 

గత సంవత్సరం పవన్ లండన్ వెళ్ళినప్పుడు అక్కడి విద్యార్ధులు కొంతమంది  రాజకీయ సామాజిక అంశాల్ని అవగాహన చేసుకునేందుకు ఏవైనా కొన్ని మంచి బుక్స్ ఉంటే చెబుతారా అని అడిగారట. దానికి పవన్ కళ్యాణ్ వెంటనే తన ట్విటర్ లో స్పందిస్తూ ఒక పుస్తకం పేరు చెప్పాడు. ఆ పుస్తకం పేరు ‘వియ్ ది నేషన్ - ది లాస్ట్ డికేడ్స్’ నానోభాయ్ పల్కివాలా అనే ప్రముఖ మరాఠీ రచయిత రాసిన ఈ పుస్తకం చదవడం వల్ల తన రాజకీయ ఆలోచనలు బలపడ్డాయి అని చెపుతూ తన రెండో అన్నయ్య లా చదువుతున్నరోజుల్లో ఆ పుస్తకం తనకు ఇచ్చాడని పవన్ వ్యాఖ్యానిస్తూ తన పొలిటికల్ జర్నీకి కారణం ఆ పుస్తకం కారణం అన్న విషయం తన అన్నయ్య కే తెలియదు అని పవన్ కామెంట్ చేసాడు. 

అయితే ఆ పుస్తకం తనకు తన అన్నయ్య 1980 ప్రాంతాలలో ఇచ్చినట్లు పవన్ చెపుతున్నాడు. అయితే పవన్ పచ్చి అబద్ధం చెప్పాడని లండన్ లోని విద్యార్ధులు పవన్ చెప్పిన విషయం పై కామెంట్స్ చేస్తున్నారు. పల్కివాలా ఆ పుస్తకం వ్రాసింది 1994లో అయితే 1980లోనే పవన్ కు అతడి అన్నయ్య ఆ పుస్తకాన్ని ఎలా ఇచ్చాడు అన్న ప్రశ్నలు ఆ విద్యార్ధులు వేస్తున్నారు.

ఈవిషయం పై పవన్ అభిమానులు వేరే విధంగా స్పందిస్తూ ‘నైంటీన్ ఎయిటీస్’.. అంటే 1980 నుంచి 1989 వరకూ అప్లయ్ అవుతుంది..’ అంటూ సమర్థిస్తున్నారు. కానీ ఆప్రయత్నం కూడ బెడిసి కొడుతోంది. 1994లో వచ్చిన ఈపుస్తకాన్ని పవన్ ముందుగా కలలో చదివాడా అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఏమైనా పవన్ రాజకీయాలలోనే కాదు పుస్తకాల విషయంలో కూడ కన్ఫ్యూజ్ అవుతున్నట్లు కనిపిస్తోంది..   
Pawan Kalyan
✔@PawanKalyan
When I was in London, a group of girls& boys had asked me to suggest few books for widening their level of
socio- political
understanding; that’s the Reason why I am posting the books which I have read & these are from my personal library.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: