సినీ సమస్యల పరిష్కారం సుగమం..అధికార ప్రతినిధులు వీరే..!

Edari Rama Krishna
ఈ మద్య తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.  ఆ మద్య డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయిన తర్వాత సినీ ప్రముఖుల పేర్లు బయటకు రావడం..సినీ పరిశ్రమలో కొందరితో ముఖ్య సభ్యుడైన కెల్విన్ తో లింకులు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి.   తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో తొలి చార్జ్‌షీటు దాఖలైన విషయం తెలిసిందే.  ఈ కేసులో అకున్‌ సబార్వాల్‌ నేతృత్వంలోని సిట్‌ 10 మంది టాలీవుడ్‌ ప్రముఖ హీరోలు, హీరోయిన్లు, దర్శకులను విచారించారు. 

సిట్‌ విచారించిన వారిలో పూరీ జగన్నాథ్, రవితేజ, తరుణ్, నవదీప్, నందు, తనీష్, ఛార్మి, ముమైత్‌ఖాన్, సుబ్బరాజు, శ్యాం కే నాయుడు తదితరులు ఉన్నారు. ముగ్గురి నుంచి రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలను తీసుకుని ఫోరెన్సిక్‌ పరిశీలనకు పంపించడం జరిగింది. ఫోరెన్సిక్‌ నివేదిక అందడంతో ముగ్గురు వ్యక్తులపై సిట్‌ చార్జ్‌షీటును దాఖలు చేసింది.  కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌కు నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ మద్య టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ తో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయని నటి శ్రీరెడ్డి ఆరోపిస్తు వచ్చారు. తనతో కొంత మంది దారుణంగా ప్రవర్తించారని..వారి పేర్లు బయట పెడతానని కొంత మంది ఫోటోలు లీక్ చేసింది. 

ఇందులో దగ్గుబాటి అభిరామ్, సింగర్ శ్రీరామ్, వైవా హర్ష, కోన వెంకట్ ఇలా పలువురు తనతో చాటింగ్ చేసిన ఫోటోలు లీక్ చేసింది. అంతే కాదు మా అసోసియేషన్ వారు తనకు కార్డు ఇవ్వడం లేదని ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన కూడా చేసింది. దాంతో శ్రీరెడ్డి పోరాటానికి అనూహ్య స్పందన వచ్చింది.. మహిళా సంఘాలు, జూనియర్ ఆర్టిస్టులు మరికొంత మంది ఆమెకు మద్దతు పలికారు.  ఇక తన ఉద్యమం ముందుకు సాగుతుందనుకున్న సమయంలో శ్రీరెడ్డి పవన్ కళ్యాన్ ని దారుణంగా తిట్టింది. దాంతో శ్రీరెడ్డిపై ఒక్కసారే విమర్శలు వెల్లువెత్తాయి. చాలా మంది మద్దతు ఉపసంహరించుకున్నారు.

శ్రీరెడ్డి వ్యాఖ్యలపై  పవన్ ఫ్యాన్స్ ఆగ్రహాలు కట్టలు తెంచుకున్నాయి.  ఇది కాస్త మెగా ఫ్యామిలీ వర్సెస్ మీడియా మద్య వైరం మొదలైంది. ఇలా ప్రతిరోజూ సినీ పరిశ్రమలో ఎదో ఒక వివాదం చెలరేగుతుంది. ఈ మద్య లైట్స్ మెన్ లు కూడా ధర్నా చేశారు. ఇక సినిమా  సమస్యలపై ఎవరిని సంప్రదించాలో.. సమస్యపై ఎవరు స్పందించాలనే అనే విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు.  దీంతో సమస్యల పరిష్కారం ఆలస్యం అవుతూ వస్తున్నది.  సమస్యల పరిష్కారం కోసం తెలుగు సినీ పరిశ్రమ కొంతమంది సభ్యులను ఎంపిక చేసింది.  ఇక ముందు పరిశ్రమలో ఇకపై ఎటువంటి సమస్యలు ఉన్నా.. అధికార ప్రతినిధులకు విన్నవించుకోవచ్చని తెలుగు చిత్రపరిశ్రమ ప్రకటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: