గ్లామర్ డోస్ పెంచుతూ యువకుల గుండెల్లో గిలిగింతలు పెడుతున్న మెహ్రీన్

టాలీవుడ్ హీరో నితిన్ సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో "శ్రీనివాస కల్యాణం" సినిమా తర్వాత "ఛలో" దర్శకుడు వెంకీ కుడుములతో మరో కొత్త సినిమా చేయనున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్‌ గా మెహ్రీన్ నటిస్తుంది.  నితిన్ సొంత బ్యానర్ లో ఈ సినిమాను రూపొందించనున్నారు. 'శ్రీనివాస కల్యాణం' షూటింగ్ పూర్తికాగానే, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని సమాచారం.  

ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల మధ్య గ్లామర్ హీరోయిన్‌ గా మంచి మార్కులు కొట్టేసిన మెహ్రీన్, ప్రస్తుతం 

*గోపిచంద్‌ తో పంతం, 
*వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కే మల్టీస్టారర్ 'ఎఫ్2'
*విజయ్ దేవరకొండ ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న "నోటా" లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

ఇందులో వెంకీ, వరుణ్ తేజ్ అనే మల్టీస్టారర్ 'ఎఫ్2'  సినిమాలో ఛాన్స్ రావడంపై మెహ్రీన్ హర్షం వ్యక్తం చేసింది.  ‘రాజా ది గ్రేట్’  సినిమాకు దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడినే 'ఎఫ్-2' సినిమా కు డైరక్టర్ కావడంతో మెహ్రీన్ సంతోషానికి హద్దుల్లేకుండా పోయింది.  2016 లో అనిల్ రావిపూడి "రాజా ది గ్రేట్"  సినిమా బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

వేసవి ప్రభావమో, గ్లామర్‌ను ఒలికించాలనే ఆరాటమో కానీ, హీరోయిన్ లు ఈమద్య వరసగా హాట్‌ బికినీ పోజులు ఇచ్చేస్తూ ఉన్నారు. ఈ జాబితాలో చేరింది మెహ్రీన్ కూడా. ఇప్పటి వరకూ చేసిన సినిమాల్లో ఈ హీరోయిన్  పక్కింటమ్మాయి తరహాలో కనిపిస్తోంది. వరసగా అలాంటి పాత్రలే చేస్తోంది. అయితే అలాంటి గుర్తింపు చాలదని ‘గ్లామర్ డోస్‌’ ను క్రమంగా పెంచుతోంది ఈ భామ. 

తాజాగా వావ్ (WOW) మ్యాగజైన్ కోసం మెహ్రీన్ కాస్త హాట్ గానే పోజు ఇచ్చింది. బికినీలో పోజు ఇచ్చి ఆ పత్రిక కవర్ పేజీకి  వన్నెలు తెచ్చింది. తద్వారా అందాల ప్రదర్శనకు సై అని సినిమా రూపకర్తలకు కూడా సంకేతాలు పంపించింది. ముద్దుగా బొద్దుగా ఉన్న మెహ్రీన్, తను బికినీకి కూడా ఫిట్ అవుతానని ఈ పోజుతో నిరూపించు కుంది. అలాగే అభిమానుల గుండెల్లోకి మరింత లోతుగా చొచ్చుకుపోయింది. ప్రస్తుతం మెహ్రీన్ పిర్జాదా అవకాశాల వేటలో ఉంది. ఈ పోజుతో ఇంకా కొన్ని కొత్త అవకాశాలు  వస్తాయేమో చూద్ధాం! 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: