కాస్టింగ్ కౌచ్ తో టాలీవుడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేసి హాట్ న్యూస్ గా మారింది. ఇక సీన్ లోకి వర్మ రావడం ఆ వ్యవహారం కాస్త పక్క దారి పట్టడం గురించి తెలిసిందే. కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న శ్రీరెడ్డి ఇప్పుడు మళ్లీ హాట్ హాట్ కామెంట్స్ తో రచ్చ మొదలు పెట్టింది.
రెండు మూడు వారాల నుండి సైలెంట్ గా ఉన్న అమ్మడు మళ్లీ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ద్వారా నాచురల్ స్టార్ నానిని ఏకిపారేసింది. కాస్కోరా నాని నీ టోకన్ వచ్చింది అంటూ స్టార్ రేంజ్ ఉన్న హీరోని పట్టుకుని నానా మాటలనేసింది శ్రీరెడ్డి. అంతేకాదు ఓ అమ్మాయికి రోజంతా చుక్కలు చూపించాడంటూ చెప్పుకొచ్చింది.
తెర మీద అందరు శ్రీరంగ నీతులు చెబుతారు.. నాచురల్ స్టార్ నాని ఓ రోజంతా ఒక అమ్మాయికి నరకం చూపించాడు అంటూ కామెంట్ పెట్టింది. ఇక కాసుకోరా నాని అంటూ నాని ఛాలెంజ్ కూడా చేసింది శ్రీరెడ్డి. శ్రీరెడ్డి ఇష్యూలో పవన్ కూడా పలచన పడ్డాడు అలాంటిది నాచురల్ స్టార్ నాని ఎలా దీన్ని డీల్ చేస్తాడో అని అంటున్నారు.
అంతేకాదు ఈ విషయంపై నాని ఎలాంటి రెస్పాన్స్ ఇస్తాడు అన్నదాని మీద కూడా మీడియా ఫోకస్ పెట్టింది. అయితే పవన్ ఇష్యూ జరిగాక శ్రీరెడ్డిని ఎవరు పిలిచి డిస్కషన్స్ చేయట్లేదు. మరి నాని విషయంలో శ్రీరెడ్డి కామెంట్స్ ఏమేరకు ప్రభావితం చూపిస్తాయో చూడాలి.