సాహో కు శాపంగా బాహుబలి స్ట్రాటజీ !

Seetha Sailaja
‘బాహుబలి’ ఘనవిజయంలో రాజమౌళి అనుసరించిన పబ్లిసిటీ స్ట్రాటజీ చాలకీలకంగా మారి ఆమూవీ చారిత్రక విజయానికి ఎంతోసహాయం చేసిన విషయం తెలిసిందే. ‘బాహుబలి’ మూవీలోని పాత్రలను ఒకొక్క దానిని పరిచయం చేస్తూ రాజమౌళి అనుసరించిన వ్యూహంతో ‘బాహుబలి’ పాత్రలు జనం హృదయాలలోకి వెళ్ళిపోయాయి. ఈ స్ట్రాటజీతో ‘బాహుబలి’ ఘనవిజయం సాధించడంతో ఈపద్ధతిని అనుసరిస్తూ చాల సినిమాలు ప్రయత్నాలు చేసినా ఆప్రయత్నాలు ఒక్క ‘బాహుబలి’ కి తప్ప మరే సినిమాకు కలిసిరాలేదు. 

అయితే అనూహ్యంగా ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘సాహో’ ‘బాహుబలి’ పబ్లిసిటీ స్ట్రాటజీని అనుసరిస్తోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈమూవీ బడ్జెట్ 300 కోట్ల వరకు పెరిగిపోయింది అని లీకులు ఇవ్వడంతో పాటు ఈమూవీ దుబాయ్ షెడ్యూల్ కు సంబంధించిన ఫోటోలు ఒకొక్కటిగా లీక్ చేస్తూ ‘సాహో’ యూనిట్ అనుసరిస్తున్న వ్యూహం రాజమౌళి ‘బాహుబలి’ వ్యూహాన్ని గుర్తుకు చేస్తోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే రాజమౌళి ‘బాహుబలి’ నిర్మాణం చివరకు వచ్చిన తరువాత తన మూవీలోని ఒకొక్కరి పాత్ర లుక్ ను బయటపెడితే ‘సాహో’ యూనిట్ మటుకు ముందు నుంచే ఈమూవీలోని ప్రభాస్ లుక్ ను బయటపెడుతోంది.

దీనివల్ల ప్రభాస్ అభిమానులకు ఆనందం కలిగినా ఇంకా ‘సాహో’ విడుదల కావడానికి ఇంకా చాలారోజులు పడుతుంది కాబట్టి ఇప్పటి నుంచే ఈమూవీలోని ప్రభాస్ లుక్ కు జనం అలవాటుపడిపోతే ఈమూవీ విడుదలకు ముందు ప్రభాస్ లుక్ లో కొత్తదనం ఏమి చూపెడతారు అన్న కామెంట్స్ కొందరు చేస్తున్నారు. దీనితో ప్రభాస్ ఇప్పటి నుంచే ఈసినిమాకు సంబంధించిన తన ఫోటోలను లీక్ కాకుండా చూసుకోవడం మంచిది అన్నఅభిప్రాయం మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. 

ప్రస్తుతం ఈమూవీకి సంబంధించిన భారీ యాక్షన్ షెడ్యూల్ దుబాయ్ లో జరుగుతున్న నేపధ్యంలో ఈషెడ్యూల్ ను మరో నెలరోజులు పొడిగించమని ప్రభాస్ అడుగుతున్నట్లు టాక్. దీనికికారణం దుబాయ్ లో ప్రస్తుతం మండిపోతున్న ఎండల నేపధ్యంలో భారీ జంప్ లు ఫైట్లు చేసి ప్రభాస్ ఒళ్లు హూనమైపోతోందట. అందుకే షూటింగ్ అనుకున్నదానికంటే లేటుగా అవుతోందని ఈకారణాలతో ప్రభాస్ ఈషెడ్యూల్ ను జూన్ వరకు పొడిగించమని కోరాడు అని వార్తలు వస్తున్నాయి. ఏమైనా ‘బాహుబలి’ స్ట్రాటజీ ‘సాహో’ కు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: