కుర్రాళ్ల మతిపోగుడుతున్న తమన్నా సెక్సీ స్టెప్పులు!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో ‘హ్యాపీ డేస్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తమన్న తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు.  ఆ మద్య కొంచెం ఇష్టం-కొంచెం కష్టం కాస్త పరవాలేదు అనిపించింది.  దాంతో ఈ అమ్మడు ఐటమ్ సాంగ్స్ కి కూడా ఓకే చెప్పడంతో పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్ లో నటించింది.  ఇక రాంచరణ్ తో కలిసి రచ్చ చిత్రంలో నటించి దుమ్మురేపింది.  ఇక రాజమౌళి దర్శకత్వం వహంచిన ‘బాహబలి’పార్ట్ 1 లో అవంతిక పాత్రలో అప్సరసలా కనిపించింది. 

దాంతో ఈ అమ్మడి పేరు జాతీయ స్థాయిలో మారుమోగింది.  ఇక బాలీవుడ్ లో కూడా రెండు మూడు చిత్రాల్లో నటించింది. తాజాగా ఈ అమ్మడి హాట్ డ్యాన్స్ ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.  ఇటీవల తమన్నాకు, ఫ్రెంచ్ డీజే అయిన డీజే స్నేక్ మధ్య సోషల్ మీడియాలో సంభాషణ జరిగింది. స్నేక్ మాట్లాడుతూ బాహుబలి చిత్రాన్ని చూశానని తమన్నా ఫెర్ఫామెన్స్ బావుందని అన్నారు.

తమన్నా కూడా స్నేక్ కు బదులిచ్చింది. టీవల స్నేక్ ఆల్బమ్ నుంచి విడుదలైన మాగంట రిథమ్ సాంగ్ తనకు చాలా బాగా నచ్చిందని తమన్నా తెలిపింది. దీనికి డాన్స్ చేయగలవా అంటూ స్నేక్ ఛాలెంజ్ విసిరాడు. దానికి రియాక్ట్ అయిన తమన్నా..ఆ ఛాలంజ్ ని సీరియస్ గా తీసుకున్నా తమన్నా దుమ్ము దులిపేసింది. ఆ సాంగ్ కు తమన్నా చేసిన డాన్స్ ప్రస్తుతం యువతని కుదిపేస్తోంది.

గత ఏడాది విడుదలైన ఎన్టీఆర్ జై లవకుశ చిత్రంలో తమన్నా ఐటెం సాంగ్ చేసింది. స్వింగ్ జర అనే ఈ సాంగ్ ఇప్పటికి యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతోంది.ఈ సాంగ్ లో తమన్నా అందాల ఆరబోత, రెచ్చిపోయి డాన్స్ చేసిన విధానం యువత మతి పోగొట్టేలా చేసింది. తాజాగా ఈ అమ్మడు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: