కుర్ర హీరోయిన్ పై ఎన్.టి.ఆర్ ఇంట్రెస్ట్.. త్రివిక్రం సినిమాలో ఛాన్స్..!

shami
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమాలో ఎన్.టి.ఆర్ తో పూజా హెగ్దె రొమాన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మరో హీరోయిన్ కు అవకాశం ఉందని తెలుస్తుంది. ముందు శ్రద్ధ కపూర్ ఆ ఛాన్స్ పట్టేసిందని అన్నారు కాని ఇప్పుడు ఆ సినిమాలో సెకండ్ లీడ్ గా తెలుగమ్మాయి ఈషా రెబ్బ సెలెక్ట్ అయ్యిందని తెలుస్తుంది.


ఈమధ్యనే రిలీజ్ అయిన సినిమా ఫస్ట్ లుక్ కు బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. సిక్స్ ప్యాక్ తో ఎన్.టి.ఆర్ సంచలనం సృష్టించడానికి వస్తున్నాడనిపిస్తుంది. డీజేలో బికినితో ప్రేక్షక హృదయాలను గెలిచిన పూజా ఈ సినిమాలో లీడ్ హీరోయిన్ గా చేస్తుంది. ఆమె పేరు సినిమాలో అరవింద అని టైటిల్ చూస్తేనే తెలుస్తుంది.


ఇక సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంటుందని తెలుస్తుంది. తెలుగు అమ్మాయిగా అంతకుముందు ఆ తర్వాత సినిమాతో తెరంగేట్రం చేసిన ఈషా ఆమి తుమితో తన సత్తా చాటింది. ఈమధ్యనే వచ్చిన అ! సినిమాలో కూడా ఈషా నటించి మెప్పించింది. త్రివిక్రం ఈషా నటనా ప్రతిభను చూసి ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడట.


ఎన్.టి.ఆర్ కూడా ఈషాకు ఛాన్స్ ఇవ్వడంలో ఇంట్రెస్ట్ చూపించినట్టు తెలుస్తుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా దసరా బరిలో దించాలని చూస్తున్నారు. ఒకవేళ నిజంగానే ఈ సినిమాలో ఈషా నటిస్తే కెరియర్ లో మొదటిసారి స్టార్ సినిమాలో అవకాశం దక్కించుకున్నట్టు అవుతుంది. మరి అమ్మడికి అరవింద సమెట ఎలా కెరియర్ బూస్టింగ్ ఇస్తుందో చూడాలి.   



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: