పవన్ ఆజ్ఞను అమలు పరుస్తున్న కొరటాల !

Seetha Sailaja
‘భరత్ అనే నేను’ సూపర్ సక్సస్ ను ఎంజాయ్ చేస్తూ ప్రస్తుతం కొరటాల తన భార్యతో అమెరికా ట్రిప్ లో ఉన్నాడు. అయితే ఈలోపే కొరటాల తీయబోయే తదుపరి సినిమాలో తామే హీరోగా ఉండాలని అనేకమంది టాప్ హీరోలు తమతమ స్థాయిలో కొరటాల పై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ కొరటాలతో ఒక మంచి పవర్ ఫుల్ సోషల్ సబ్జెక్ట్ చేయాలని తెగ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 

అయితే కొరటాల మాత్రం తన మనసులో మాట బయటపెట్టకుండా గుంభనంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థుతులలో కొరటాల పవన్ సూచనలను గుర్తుకు చేసుకుని అమలు పరుస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు కొరటాల ‘భరత్ అనే నేను’ మూవీ నిర్మిస్తున్న రోజులలో పవన్ ను కలిసి ఒక పవర్ ఫుల్ సోషల్ సబ్జెక్ట్ ను చెప్పినట్లు సమాచారం. అయితే పవన్ ఆ కథ తనకు బాగా నచ్చింది అని చెపుతూ ‘అజ్ఞాతవాసి’ తరువాత తాను సినిమాలు చేయనని అందువల్ల ఈకథను చిరంజీవితో తీయమని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. 

అయితే ఈవిషయాలు ఆలస్యంగా రామ్ చరణ్ దృష్టికి రావడంతో ప్రస్తుతం చరణ్ కొరటాల చిరంజీవిల మూవీ ప్రాజెక్ట్ కు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి ‘సైరా’ లో నటిస్తున్న నేపధ్యంలో చిరంజీవి లుక్ లో మార్పులు చేయకుండా అదే లుక్ తో కొరటాల సినిమాలో కూడ సమాంతరంగా నటింపచేసే అవకాశాలను రామ్ చరణ్ చాల తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు టాక్. 

అంతేకాదు ఈమూవీకి జరిగే బిజినెస్ లో కొరటాల కు షేర్ ఇస్తానని చరణ్ ఆఫర్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో కొరటాల త్వరలో చిరంజీవిని కలిసి తాను గతంలో పవన్ కోసం తయారు చేసుకున్న కథను వినిపించబోతున్నాడని సమాచారం. ఈవార్తలే నిజం అయితే మెగా అభిమానులు పండుగ చేసుకునే న్యూస్ గా ఇది మారనున్నది..    



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: