సావిత్రి ఆ పరిస్థితిలో చూశాను!

Edari Rama Krishna
తెలుగు, తమిళ  ఇండస్ట్రీలో ‘మహానటి’కలెక్షన్ల పరంగా దూసుకు వెళ్తుంది.  అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా చేసుకొని నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తమిళనాట, ఓవర్సీస్ లో కూడా కలెక్షన్ల పరంగా దుమ్మురేపుతున్నాయి. ఇక మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటనకు చిన్నా పెద్దా అందరూ ఫిదా అయ్యారు.  ఈ చిత్రంలో అన్ని పాత్రలకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వడంతో ‘మహానటి’ అంత అద్భుతంగా వచ్చింది. 

సినిమా ఇండస్ట్రీనే కాదు..రాజకీయ నాయకులు సైతం ఈ చిత్రాన్ని ఎంతో గొప్పగా మెచ్చుకున్నారు.  తాజాగా మహానటి సావిత్రి గురించి విశ్వనటుడు కమల్ హాసన్ తనకు ఉన్న అనుబంధం గురించి తెలిపారు.  బాల నటుడిగా నేను సావిత్రి గారితో కలిసి చాలా సినిమాల్లో నటించాను. ఆమె నన్ను ఓ దత్త పుత్రిడిలా ఎంతో ప్రేమగా చూసుకునేది. సావిత్రి గారికి ఇష్టమైన కిళ్లీ కట్టించుకురావడానికి ఇంపాలా కార్లు వెళ్లేవి .. అలాంటి సావిత్రి గారు ఆ తరువాత టాక్సీ కోసం రోడ్డు పక్కన వెయిట్ చేస్తుండటం చూశాను.

అప్పుడు నా మనసు ఎంతో ఆవేదన చెందింది.  నీజంగా అంత లగ్జరీ కార్లలో తిరిగిన సావిత్ర అమ్మానే ఇలా రోడ్డుపై ట్యాక్సీ కోసం నిల్చుందని ఆశ్చర్యపోయానని అన్నారు.  అంతే కాదు ఆమె ఇంటికి వెళ్లేవాడినని..ఆది ఒక పెద్ద ప్యాలెస్ అని..రాజ్ మహాల్ లా ఉండేదని..ఉండేది. నేను నిర్మాతగా మారిన తరువాత ఆమెను కలవాలనుకున్నాను. మా మేనేజర్ నన్ను ఆ బంగ్లాకి కాకుండా ఓ చిన్న గదికి తీసుకెళ్లాడు.

అక్కడ సావిత్రి గారిని చూసి నేను తట్టుకోలేకపోయాను .. కన్నీళ్లు ఆపుకోలేకపోయాను" అంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.  నిజంగా ఆమె జీవింతం ఓ అద్భుతమని..ఆనందాలు..కష్టాలు.. కన్నీళ్లు అన్నీ నా కళ్లముందే కనిపించాయని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: