రజినీ ‘కాలా’పై కుల వివాదం!

siri Madhukar
ఏ ముహూర్తంలో రజినీకాంత్ ‘కాలా’సినిమా మొదలు పెట్టారో కాని అన్నీ వివాదాలే చుట్టుముడుదున్నాయి. గతంలో పా రంజీత్ దర్శకత్వంలో ‘కబాలి’ సినిమాలో నటించిన రజినీకాంతో మరోసారి ఇదే యువదర్శకుడితో ‘కాలా’సినిమాలో నటించాడు.  అయితే రజనీకాంత్ నటించిన ‘కాలా’ సినిమా విడుదలకు అభ్యంతరాల పరంపర కొనసాగుతూ ఉంది. ఈ సినిమాను విడుదల చేయకూడదని బహిరంగహెచ్చరికలు, కోర్టుల్లో పిటిషన్లు కొనసాగుతూ ఉన్నాయి. 

‘కాలా’ చిత్రం లో  తన తండ్రి పేరు, జీవిత కథను వాడుకున్నారంటూ ముంబైకి చెందిన జర్నలిస్టు జవహర్ నాడార్.. రజినీకాంత్‌తో పాటు ‘కాలా’ టీంకు లీగల్ నోటీసులు పంపారు.  ఒకవైపు ఈ సినిమా రేపు విడుదల కావాల్సి ఉండగా.. నేడు తమిళనాట ఒక పిటిషన్ విచారణకు రానుంది.   కావేరీ జల వివాదంపై రజనీకాంత్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ సినిమాను కన్నడ నాట విడుదలకు అక్కడి సంఘాలు అభ్యంతరం చెప్పిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాను విడుదల చేయమని కర్ణాటక ఎగ్జిబీటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ప్రకటించారు. కర్ణాటక హైకోర్టులో వివాదం పరిష్కారం అయ్యింది. ఈ సినిమా విడుదలకు హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, థియేటర్ల వద్ద భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాజాగా ఈ సినిమా విడుదలకు తమిళనాడులోని ఒక కులం అభ్యంతరం చెబుతోంది.

ఈ మేరకు నాడార్‌ల సంఘం కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ సినిమాలో  నాడార్‌ల మనోభావాలను దెబ్బతీస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఈ సినిమా విడుదలపై స్టే విధించాలని ఆ కులసంఘం కోరుతోంది. ఈ సినిమా విడుదలను ఆపాలని ముఖ్యమంత్రి పళనిస్వామికి కూడా నాడార్‌ల సంఘం వినతిపత్రాన్ని ఇచ్చింది. ఈ పిటిషన్ కోర్టులో నేడు విచారణకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: