తమిళ హీరోలందరికి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. మంచి కథాబలం ఉన్న సినిమాలు తీస్తూ వాటిని తెలుగులోకి డబ్ చేస్తూ ఇక్కడ కూడా వారు మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నారు. ఈ లిస్టులోనే కోలీవుడ్ హీరో విక్రమ్ కూడా ఒకరు. అపరిచితుడు సినిమా నుంచి విక్రమ్‌కు తెలుగులో మార్కెట్ స్థిరపడింది. చియాన్ విక్రమ్‌ను తెలుగు ప్రేక్షకులు కూడా బాగా ఇష్టపడతారు.
తాజాగా విక్రమ్ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఒకటి సింహం హరి డైరెక్షన్లో సామి స్క్వేర్, రెండోది గౌతమ్ మీనన్ డైరెక్షన్లో ధృవనచ్చిత్రమ్. ఈ రెండు సినిమాల్లో సామి స్క్వేర్ ముందుగా వస్తోంది. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం వచ్చిన సామి (తెలుగులో బాలకృష్ణ లక్ష్మీనరసింహా) సినిమాకు సీక్వెల్‌గా వస్తోన్న సామి స్క్వేర్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది.
సామి స్క్వేర్‌పై సౌత్ ఇండియాలో భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగులోనూ మంచి అంచనాలు ఉండడంతో ఈ సినిమా తెలుగు వెర్షన్ హక్కులు భారీ రేటుకు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం విక్రమ్‌కు తెలుగులో మార్కెట్ తగ్గినా సామి స్క్వేర్ రైట్స్ రూ. 8 కోట్లకు అమ్ముడయ్యాయి. బెల్లం రామకృష్ణారెడ్డి, గిరిలు ఈ హక్కుల్ని సొంతం చేసుకున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఏ చిత్రంలో ఇటీవలే ‘మహానటి’తో భారీ సక్సెస్ అందుకున్న కీర్తి సురేష్ కథానాయకిగా నటిస్తోంది.