తెలుగు ఇండస్ట్రీలో తరుణ్ బాస్కర్ దర్శకత్వం వహించిన ‘పెళ్లిచూపులు’చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించిన హీరో విజయ్ దేవరకొండ. తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలో ‘అర్జున్ రెడ్డి’ చిత్రంలో అర్జున్ రెడ్డిగా విజయ్ దేవరకొం నటనకు యూత్ బాగా కనెక్ట్ అయ్యింది. ఈ చిత్రం ఊహించిన దానికన్నా ఎక్కువ క్రేజ్ సంపాదించింది. చిన్న చిత్రం అయినా..బారీ వసూళ్లు చేసింది. అర్జున్ రెడ్డి' చిత్రంతో స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత వరుస అవకాశాలతో బిజీ అయిపోయాడు.
ప్రస్తుతం విజయ్ టాక్సీవాలా, నోటీ, డియర్ కామ్రెడ్, గీతా గోవిందం చిత్రాల్లో నటిస్తున్నాడు. తాజాగా 'గీతా గోవిందం' మూవీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. మీరేమైనా అనుకోండి నేను స్టిల్ వర్జిన్ అంటూ విజయ్ ట్విట్టర్ ద్వారా ఈ పోస్టర్ షేర్ చేశారు. తాజాగా ఈ చిత్రం గురించి నిర్మాత అల్లు అరవింత్ మాట్లాడుతూ.."గీతగోవిందం" చిత్రం విజయ్ దేవరకొండకి మరింత పేరు తెచ్చిపెడుతుంది.
విజయ్ చాలా ఫ్యాషన్ వున్న హీరో. పక్కా ఫ్యామిలి ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. పరుశురాం మా బ్యానర్ లో రెండవ చిత్రం చేస్తున్నాడు. హీరోయిన్ కూడా తన పాత్రకు తగ్గ పర్ఫామెన్స్ ఇచ్చిందని అన్నారు. దర్శకుడు పరుశురామ్ (బుజ్జి) మాట్లాడుతూ... గీతాఆర్ట్స్ లో శ్రీరస్తు శుభమస్తు చిత్రం తరువాత ఈ చిత్రం చేస్తున్నాను. గీత గోవిందం చిత్రాన్ని రోమాంటిక్ ఫ్యామిలి ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు అగష్టు 15న తీసుకువస్తున్నారు. విజయ్ దేవర కొండ గోవిందం అనే పాత్రలో ఇప్పటి వరకూ చెయ్యని విభిన్నమైన షెడ్స్ లో కనిపిస్తాడు.
అందుకే చాలా జగ్రత్తగా తన ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ పాత్రని డిజైన్ చేశాను. గీత పాత్రలో రష్మిక పరకాయప్రవేశం చేసింది అన్నారు.విజయ్ దేవరకొండ, రష్మిక మందాన్న, నాగబాబు, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, గిరిబాబు, అన్నపూర్ణమ్మ, మౌర్యాని, సుభాష్, అభయ్, స్వప్నక, సత్యం రాజేష్, దువ్వాసి మెహన్, గుండు సుదర్శన్, గౌతంరాజు, అనీష, కళ్యాణి నటరాజన్, సంధ్య జనక్ తదితరులు.
సాంకేతిక నిపుణులు.. సమర్పకులు.. అల్లు అరవింద్ నిర్మాత.. బన్నివాసు కథ-స్క్రీన్ప్లే-మాటలు-దర్శకత్వం... పరుశురామ్ సంగీతం.. గోపిసుందర్ సినిమాటోగ్రాఫర్.. మణికందన్ ఎడిటర్.. మార్తాండ్.కె.వెంకటేష్ ఆర్ట్.. రమణ వంక ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్.. సత్య గమిడి స్క్రిప్ట్ కొ-ఆర్డినేటర్.. సీతారామ్ లిరిక్స్.. అనంత్ శ్రీరామ్, శ్రీమణి, కొరియోగ్రాఫి... రఘు, జాని
Meeru em aina anukondi,
My official status matram idhe madam.#GeethaGovindam
This Independence Day. pic.twitter.com/02ofgVXHC8— Vijay Deverakonda (@TheDeverakonda) July 3, 2018