ఆ పాత్రలో నటిస్తున్న సాయిపల్లవి!

siri Madhukar

టాలీవుడ్ లో ఫిదా సినిమాతో తెలుగు రాష్ట్రాల ప్రజల మనసు దోచిన మళియాళ చిన్నది సాయి పల్లవి తాజాగా తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాల్లో నటిస్తుంది.  ఈ మద్య ‘కణం’ సినిమాతో మంచి విజయం సాధించిన సాయి పల్లవి తాజాగా మరో సినిమా శర్వానంద్ కి జోడిగా ‘పడి పడి లేచె మనసు’లో నటిస్తోన్న విషయం తెలిసిందే.   ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. 


ఇప్పటి వరకు సాయి పల్లవి నటించిన సినిమాలకు డిఫరెంట్ రోల్ లో నటించబోతుందట.  ఎంతో చలాకీగా ఉండే సాయి పల్లవికి తగిన క్యారెక్టర్ అంటున్నారు దర్శకులు. తాజా సమాచారం ప్రకారం ‘పడి పడి లేచె మనస్సు’ చిత్రంలో సాయి పల్లవి ఫుట్ బాల్ ప్లేయర్ గా నటిస్తుందట. ఇంతకుముందెప్పుడూ ఇలాంటి క్యారెక్టర్ ఆమె చెయ్యలేదని, ఈ చిత్రంలో ఆమె పాత్రను చూశాకా అందరూ కొత్తగా ఫీల్ అవుతారని తెలుస్తోంది. 


మరోవైపు దర్శర, నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తెరకెక్కిస్తున్నారట.  ఈ సినిమాతో సాయి పల్లవి క్రేజ్ మరింత పెరగుతుందని చిత్ర యూనిట్ అంటున్నారు.  మొత్తానికి హను రాఘవపూడి కాంప్రమైజ్ అవ్వకుండా పక్కాగా తానూ అనుకున్న విధంగానే చిత్రకరిస్తున్నారు. దాంతో ‘పడి పడి లేచె మనసు’ చిత్ర షూటింగ్ బాగా స్లోగా నడుస్తోందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: