సీరియల్స్, సినిమాల్లో తల్లి పాత్రలు.. కాని ఆ ఆంటీ అంటే సూపర్ క్రేజ్..!

shami
సీరియల్స్ లో క్యారక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఇప్పుడు సినిమాల్లో కూడా చిన్న చిన్న రోల్స్ చేస్తూ క్రేజ్ తెచ్చుకున్న భామ మామిళ్ల శైలజా ప్రియ. సీరియల్స్ లో బిజీగా ఉన్నా సినిమా అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తుంది శైలజ ప్రియ. ఈమధ్య ఆమె తరచు సినిమాల్లో కనిపిస్తూ అలరిస్తుంది.


సీరియల్స్ లోనే నటిస్తుంది కదా అని తీసిపారేసేలా కాకుండా అమ్మడికి ఫేస్ బుక్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉండేలా చేసుకుంది. స్వతహాగా అందగత్తె అయిన ప్రియ ఫేస్ బుక్ అఫిషియల్ పేజ్ లో తన లేటెస్ట్ అప్డేట్స్ తో పాటుగా లేటెస్ట్ స్టిల్స్ కూడా అందులో ఉంచుతుంది. 


అయితే ఏమాత్రం వల్గారిటీకి ఛాన్స్ ఇవ్వకున్నా ఆమె అంటే పడి చచ్చే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారని చెప్పొచ్చు. హోమ్లీ లుక్ తో కనిపించే ప్రియకు పెళ్లి కూడా అయ్యింది. ఆమె వయసు కూడా మూడు పదులు ఈజీగా దాటి ఉంటుంది. అయినా సరే ఫేస్ బుక్ లో ఏకంగా 5 మిలియన్ ఫాలోవర్స్ తో సంచలనం సృష్టిస్తుంది ప్రియ. 


ఈ రేంజ్ ఫాలోయింగ్ సగటు హీరోయిన్స్ కూడా మెయింటైన్ చేయట్లేదు కాని ప్రియ మాత్రం తన ప్రతి అప్డేట్ ను ఫేస్ బుక్ లో పొందుపరుస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ఓ విధంగా చెప్పాలంటే ఫేస్ బుక్ లో అమ్మడి ఫాలోయింగ్ చూసి స్టార్స్ సైతం అవాక్కవుతున్నారు. ఫేస్ బుక్ లో ప్రియా క్రేజ్ ఏ దర్శకుడి కంట పడినట్టు లేదు లేదంటే ఆమెని లీడ్ హీరోయిన్ గా సినిమా చేసినా చేసే అవకాశం లేకపోలేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: