ముద్దు సీన్లలో నటించనని చెప్పా..అందుకే..

Edari Rama Krishna
ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ విపరీతంగా జరుగుతుందని ఎంతో మంది హీరోయిన్లు ఫిర్యాదులు చేస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఈ మద్య వస్తున్న చిత్రాల్లో లిప్ లాక్ లేని చిత్రాలే లేవు.  ఒకప్పుడు హాలీవుడ్ కే పరిమితం అయిన లిప్ లాక్ సీన్లు ఆ మద్య బాలీవుడ్ లో తెగ హల్ చల్ చేశారు.  లిప్ లాక్, బాత్ రూమ్, బెడ్ రూమ్ సీన్లలో కొంత మంది నటీమణులు రెచ్చిపోయి మరీ నటించారు.  హీరోల సంగతేమో కానీ ఇలాంటి శృంగారభరిత సన్నివేశాల్లో హీరోయిన్లే ఎక్కువ మార్కులు కొట్టేశారు. 

అయితే దక్షిణాది చిత్రాల్లో కూడా లిప్ లాక్ సీన్లు బాగానే వస్తున్నాయి. గత ఏడాది వచ్చిన అర్జున్ రెడ్డిలో లేటెస్ట్ సెన్సేషన్ ఆరెక్స్ 100లో హీరో హీరోయిన్ల మధ్య ఈ సీన్లే ప్రమోషన్ తో పాటు ఓపెనింగ్స్ కి చాలా హెల్ప్ అయ్యాయి. అందుకే సీన్ డిమాండ్ చేస్తోంది అంటే నిర్మొహమాటంగా దర్శకులు అవి చేయడానికి ఒప్పుకునే వాళ్లకు మాత్రమే అవకాశాలు ఇస్తున్నారు.  తాజాగా లిప్ లాక్ సీన్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది మలయాళీ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్. 

ప్రేమమ్ తో పరిచయమైన ఈ కేరళ లిప్ లాక్ కిస్ లకు పూర్తి వ్యతిరేకమట.  ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మడోన్నా సెబాస్టియన్ తనకు లిప్ లాక్ సీన్లంటే అసలు ఇష్టం ఉండదని..పెదాలపై నిమిషాల పాటు ముద్దు పెట్టించుకోవడం అసహ్యంగా ఉంటుందని..అలాంటి సన్నివేశాల్లో నటించనని చెప్పడంతో నాకు మూడు సినిమా ఛాన్సులు మిస్ అయ్యాయని చెప్పింది.  మొత్తానికి ఈ అమ్మడు కౌగిలింతకే సిగ్గుపడే తనకు ముద్దు సీన్లు ఇష్టం లేదని తేల్చి చెప్పేస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: