విజయ్ దేవరకొండ పై మండిపడుతున్న హిందూ సంఘాలు !

Seetha Sailaja
క్రేజీ హీరో విజయ్ విజయ్ దేవర కొండ సినిమాలు పై వివాదాలు రావడం ఒక సెంటిమెంట్ గా మారిపోయింది. ‘అర్జున్ రెడ్డి’ ఘన విజయానికి ఆసినిమా పై వచ్చిన వివాదాలు కూడ ఒక కారణం అన్న కామెంట్స్ ఉన్నాయి. ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకున్న ‘గీతగోవిందం’ మూవీలో విజయ్ దేవర కొండ పాడిన పాట పై హిందూ సంఘాలు మండిపడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈమూవీలో విజయ్ దేవర కొండ పాడిన పాటలోని కొన్ని చరణాలు హిందువుల మనోభావాన్ని దెబ్బ తీసేవిగా ఉన్నాయని కొందరి వాదన. ముఖ్యంగా ఈకాలంలో రాముడు సీత దగ్గరకు వచ్చి ‘జంగిల్’ కు పోదాము రమ్మంటే సీత రాను అంటూ సమాధానం ఇస్తుందని పురాణాలలోని పాత్రలు ప్రస్తుత నిజ జీవితాలలో ఎక్కడ ఉన్నాయి అంటూ ఈపాటను శ్రీమణి వ్రాసాడు.

అంతేకాదు మహాపతివ్రత సావిత్రి లాంటి వ్యక్తులు ఇప్పుడు ఉన్నారా అని ప్రశ్నిస్తూ యముడు తన భర్తను తీసుకు వెళ్ళిపోతాను అంటూ ఆమె దగ్గరకు వస్తే అలనాటి సావిత్రి ఎదిరిస్తే ఈనాటి కాలంలో నెట్ ఫ్లిక్స్ సోషల్ మీడియాలో బిజీగా ఉంటున్న నేటితరం మహిళ తన భర్తను తీసుకువెళ్ళడానికి ఇంటికి యముడు వచ్చాడు అన్న విషయం కూడ పట్టించుకునే స్థితిలో లేదు అంటూ వ్రాసిన ఈపాటలో శ్రీమణి సెటైర్లు వేసాడు. దీనితో పురాణాల పై హిందువులు అత్యంత భక్తిగా ఆరాధించే సీతాదేవి పేరు పై సెటైర్లు ఏమిటీ అంటూ హిందూ సంఘాలు మండిపోతున్నట్లు టాక్. 

కొన్ని రోజుల క్రితం రామాయణంలోని సీతను అవమానించారు అంటూ కత్తి మహేష్ పై తీవ్ర విమర్శలు వచ్చిన నేపధ్యంలో ఆవిషయం గురించి ఇంకా జనం పూర్తిగా మర్చిపోకుండానే విజయ్ దేవర కొండ తన సొంత గొంతుతో పాడిన పాట హిందువుల మనోభావాలను మరొకసారి గాయపరిచేలా ఉందని కొందరి అభిప్రాయం. దీనితో ఈ పాట పై వస్తున్న విమర్శలు రానున్న కాలంలో వివాదాలుగా మారుతాయా లేదంటే ఈపాటలోని పదాలు పెద్ద సమస్యకాదు అంటూ జనం ఎంజాయ్ చేస్తారా అన్న విషయం రానున్న రోజులలో తేలిపోతుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: