బాలీవుడ్ బ్యూటి ప్రియాంక చోప్రా నిశ్చితార్థం అయ్యిందా!

siri Madhukar
బాలీవుడ్ బ్యూటీ   ప్రియాంక చోప్రా నిశ్చితార్థం వారం క్రితమే పూర్తయిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. గత రెండు నెలలుగా నిక్ జోనస్‌తో కలిసి డేటింగ్‌లో ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల ముంబయిలో అతనితో కలిసి రెస్టారెంట్లు తిరుగుతూ మీడియా కంటపడింది. తాజాగా ఆమె సల్మాన్‌ ఖాన్‌ భరత్‌ చిత్రంలో నటిస్తుండటంతో ఫ్యాన్స్‌ హ్యాపీగా ఫీలయ్యారు. కొన్ని రోజులపాటు షూటింగ్‌లో పాల్గొన్న ఆమె.. ఇప్పుడు ఆ ప్రాజెక్టు నుంచి అర్థాంతరంగా తప్పుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. 

 ఆ వార్త నిజమేనన్న విషయాన్ని ధృవీకరిస్తూ భరత్‌ డైరెక్టర్‌ అలీ అబ్బాస్‌ జఫర్‌ ఓ ట్వీట్‌ చేశారు. ‘‘ప్రియాంక ‘భారత్’ నుంచి తప్పుకున్నారు. దీనికొక ప్రత్యేక కారణం ఉంది. షూటింగ్‌కు ఒక్కరోజు ముందు ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఆమె తీసుకున్న నిర్ణయం మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ‘భారత్ నుంచి ప్రియాంకకు శుభాకాంక్షలు’’ అని అలీ అబ్బాస్ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో ఈ డైరెక్టర్‌ పెద్ద హింటే ఇచ్చాడని బాలీవుడ్‌ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

త్వరలో వీరిద్దరూ ఒకటి కాబోతున్నారన్న కథనాలు బాలీవుడ్‌లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు అమెరికా మీడియా సైతం వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్‌ అయ్యిందంటూ వార్తలు ప్రచారం చేస్తున్నాయి. వారం క్రితం ప్రియాంక 36వ బర్త్ డే లండన్‌లో జరిగింది. అదే రోజు ఆమె ఎంగేజ్‌మెంట్ జరిగిందని అక్కడి పాపులర్ వెబ్‌సైట్ కథనం.

జొనాస్(25), ప్రియాంక(36) ఇద్దరూ 2017లో జరిగిన ఓ ఈవెంట్‌లో కలుసుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. ఇరు కుటుంబాలూ కలుసున్నాక వీరి బంధం సీరియస్ టర్న్ తీసుకుంది. వీరి ప్రేమ మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలెక్కబోతోంది.  ఇరు కుటుంబాలు ఒప్పుకోవటంతో సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌ జరిగిందని, త్వరలో వీరిద్దరూ వివాహానికి సిద్ధమయ్యారన్న వార్త ఇప్పుడు వైరల్‌ అవుతోంది.
Yes Priyanka Chopra is no more part of @Bharat_TheFilm & and the reason is very very special , she told us in the Nick of time about her decision and we are very happy for her ... Team Bharat wishes @priyankachopra loads of love & happiness for life 😊😉😍

— ali abbas zafar (@aliabbaszafar) July 27, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: