మెగా అభిమానుల సహాయనిరాకరణలో నిహారిక !

Seetha Sailaja
మెగా కాంపౌడ్ నుండి ఇప్పటివరకు వచ్చిన ఎందరో యంగ్ హీరోలకు మెగా అభిమానుల సపోర్ట్ దొరికింది. దీనితో కనీసం వారి సినిమాలకు గౌరవ ప్రదమైన ఓపినింగ్స్ వచ్చేలా పరిస్థితులు అనుకూలించాయి. అయితే మెగా డాటర్ మెగా ప్రిన్సెస్ అంటూ నిహారిక తన ఫ్యామిలీ ట్యాగ్ లను తెచ్చుకోగలిగింది కాని మెగా అభిమానుల సహకారాన్ని పొందలేకపోతోంది అంటూ కొందరు ఆసక్తికర విశ్లేషణలు చేస్తున్నారు.  

మొదట్లో చిరంజీవి అభిమానులుగా మొదలైన అభిమానులు ఆతరువాత పవన్ అల్లుఅర్జున్ రామ్ చరణ్ వరుణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ ల అభిమానులతో మెగా ఫ్యాన్స్ గా మారి ఒక శక్తిగా ఎదిగింది. దీనితో మెగా యంగ్ హీరోలు అందరూ తాము నటించే సినిమాల ఓపెనింగ్స్ కు ఎంతోకొంత మెగా అభిమానుల అండ దొరకుతుందని ఆశతో సినిమాలు చేస్తున్నారు. 

అయితే ఆశ్చర్యకరంగా కొద్దిరోజుల క్రితం విడుదలైన మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ ‘విజేత’ సినిమా గురించి ఇక లేటెస్ట్ గా విడుదలైన నిహారిక ‘హ్యాపీ వెడ్డింగ్’ గురించి పట్టించుకొకపోవడమే కాకుండా కనీసం ఈమూవీలకు ఓపెనింగ్స్ వచ్చే విషయంలో కూడ మెగా అభిమానులు సహకరించకపోవడంతో మెగా అభిమానులకు ఏమైంది అంటూ ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. దీనితో వీరిద్దరూ మెగా అభిమానుల మనసుల్ని దోచుకోలేకపోతున్నారా అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

మెగా క్యాంప్ నుంచి ఒక అమ్మాయి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వటమే సంచలనం అనుకుంటే లేటెస్ట్ గా విడుదలైన ‘హ్యాపీ వెడ్డింగ్’ పై అంచనాలు ఉన్నా కనీసపు స్థాయిలో కూడ మెగా అభిమానులు పట్టించుకోకపోవడంతో ఈమూవీకి అత్యంత కనీస స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. దీనితో మెగా అభిమానులకు వారి హీరోల పై అభిమానం ఉన్నా సినిమా బాగుండకపోతే సినిమాకు వెళ్లి చూసేరోజులు పోయిన నేపధ్యంలో లక్షల సంఖ్యలో ఉండే మెగా అభిమానుల వల్ల మెగా కుటుంబ హీరోలకు అదేవిధంగా నిహారికకు కలిసి వచ్చేది ఏమిటి అంటూ కొందరు ఘాటైన కామెంట్స్ చేస్తున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: