నితిన్ కు సహకారం లేని శ్రీనివాస కళ్యాణం !

frame నితిన్ కు సహకారం లేని శ్రీనివాస కళ్యాణం !

Seetha Sailaja
ఈతరం యౌండ్ హీరోలలో చాలా సీనియర్ హీరో నితిన్. ‘జయం’ సినిమాతో కెరియర్ ప్రారంభించిన నితిన్ తన కెరియర్ లో ఎన్నో పరాజయాలు చూసాడు. వరసగా వచ్చిన సినిమాలు పరాజయాలను కూడ తట్టుకుని నిలబడ్డాడు అంటే అతడికి అతడి తండ్రి సుధాకర రెడ్డి వల్ల వచ్చిన బ్యాక్ గ్రౌండ్.
Rashi Khanna And Nithiin Wedding In Movie Srinivasa Kalyanam

గత కొంతకాలంగా నితిన్ కు మళ్ళీ వరస పరాజయాలు పలకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే రేపు విడుదల కాబోతున్న ‘శ్రీనివాస కళ్యాణం’ తిరిగి నితిన్ కు బ్రేక్ ఇస్తుందని చాల ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఈమూవీ నితిన్ చేతికి రావడం వెనుక చాల పెద్ద కధ నడిచిందని ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు వినిపిస్తున్నాయి. 
Rashi Khanna And Nithiin Wedding In Movie Srinivasa Kalyanam

‘ఛల్ మోహన్ రంగ’ రిలీజ్ టైమ్ లో నితిన్ తండ్రి సుధాకర రెడ్డి చాలాకాలం తరువాత దిల్ రాజుతో తన అభిప్రాయ భేదాలను పక్కకు పెట్టి ‘ఛల్ మోహన్ రంగ’ విడుదలకు దిల్ రాజు సాయం తీసుకోవడంతో పాటు తన కొడుకు నితిన్ తో ఒక మంచి సినిమాను తీయమని సుధాకర రెడ్డి దిల్ రాజ్ ను కోరినట్లు సమాచారం. ‘ఛల్ మోహన్ రంగ’ ఫెయిల్యూర్ తరువాత దిల్ రాజ్ తాను ఇచ్చిన మాట ప్రకారం నితిన్ తో ‘శ్రీనివాస కళ్యా’ణం సినిమా చేసాడు. 
Rashi Khanna And Nithiin Wedding In Movie Srinivasa Kalyanam

అయితే ఈసినిమాలో నితిన్ నటించినందుకు దిల్ రాజ్ నితిన్ కు పారితోషికం ఏమీ ఇవ్వలేదని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ‘ఛల్ మోహన్ రంగ’ సినిమా వల్ల దిల్ రాజ్ కు ఏర్పడ్డ నష్టాలకు సంబంధించి సెటిల్ మెంట్లు పోను మిగిలినది పెద్దగా లేకపోవడంతో నితిన్ కు రెమ్యూనిరేషన్ రాలేదని టాక్ వినిపిస్తోంది. అయితే నితిన్ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకుండా తనకు ఒక మంచి సినిమా వచ్చినందుకు ఆనందంగా ఈసినిమాలో నటించాడని అంటున్నారు. మరి నితిన్ చేసిన త్యాగానికి ‘శ్రీనివాస కళ్యాణం’ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో రేపు తేలిపోతుంది..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: