విడాకుల వెనుక కారణాలు బయటపెట్టిన పవన్ !

Seetha Sailaja
పవన్ కళ్యాణ్  రాజకీయాలలోకి వచ్చిన తరువాత అతడి మూడు పెళ్ళిళ్ళ అంశం మరింత హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం పవన్ రాజకీయ ప్రత్యర్థులు సైతం ఇదే అంశాన్ని ఆయుధంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విషయాలా పై ఇప్పటివరకు మౌనం వహించిన పవన్ నిన్న తన పోరాటయాత్రలో అసలు విషయాలు బయటపెట్టాడు. 

తనకు ఒళ్లు పొగరెక్కి మూడు వివాహాలు చేసుకోలేదని తనతో వారికి సుఖంలేక వారు వెళ్ళిపోవడం వల్లనే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని అంటూ సద్ధిచేప్పే ప్రయత్నంచేసాడు. అంతేకాదు చాలమంది ప్రముఖ రాజకీయ నాయకులతో కంపేర్ చేసుకుంటే తన వ్యక్తిగత జీవితం చాలా శుభ్రమైనది అంటూ తాను తన వ్యక్తిగత విషయాల గురించి రహస్యాలు దాస్తు బయట ఒకరకంగా లోలోపల ఒకలా ఉండే మనిషిని కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. 

అంతేకాదు తన పెళ్ళిళ్ళ వ్యవహారంలో జరిగిన సంఘటనలు దురదృష్టకరం అని అంటూ జరిగిన సంఘటనలు తన ప్రేమేయం లేకుండానే జరిగి పోయాయని తన కర్మ అలా వ్రాసి ఉన్నప్పుడు ఎవరు తప్పించలేరు అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడాడు పవన్. అయితే తనలాంటి వాడితో కలిసి జీవించే ఏవ్యక్తికి సుఖం ఉండదనీ అంటూ తన ఇంట్లో ఒక మూలాన పుస్తకాలు చదువుకుంటూ తనను చూసే వ్యక్తులు ఎవరు తనను సినిమా హీరో అనుకోరు అంటూ తన పై తానే తెలివిగా సెటైర్లు వేసుకున్నాడు పవన్.

తన జీవితంలో పార్టీలు, పబ్బులు ఉండవనీ పుస్తకాలు చదువుకుంటూ తన ఇంటిలోని  ఆవులు దగ్గరో గేదెల దగ్గరో కాలం గడుపుతూ ఉండే తన వ్యక్తి గత జీవితం చిన్నాభిన్నం అయిపోయింది అంటూ ఇలా అయినందుకు తాను ఎంత ఏడ్చానో తనకే లెక్కలేదు అంటూ తన ఆవేదన వ్యక్త పరిచాడు పవన్. దీనినిబట్టి చూస్తుంటే పవన్ తన రెండు పెళ్లిళ్లు విషాదాంతం కావడం వెనుక తప్పు తనది కాదని ఆతప్పు తన మాజీ భార్యలది అన్న అర్ధం వచ్చేలా పవన్ కామెంట్స్ చేసాడని అప్పుడే పవన్ మాటల పై విమర్శలు మొదలైపోయాయి. అధికారమే లక్ష్యంగా రాజకీయాలలో అడుగులు వేస్తున్న పవన్ తన వ్యక్తిగత జీవితం గురించి వివరించిన నేపధ్యంలో ఇకనైనా పవన్ మూడు పెళ్ళిళ్ళ వ్యవహారం పై విమర్శలకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: