మహేష్ బాబు అంటే అందానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నది అందరికీ తెలిసిందే. అతనికి ప్రతి పుట్టిన రోజు వయసు తగ్గుతూ వస్తుంది. రోజు రోజుకూ అందం రెట్టింపు అవుతూ ఉంటుంది. హ్యాండ్సమ్ హీరో మహేష్ పక్కన హీరోయిన్ మాత్రమే కాదు. తల్లిగా వేసే వారు కూడా అందంగా ఉంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది కదా. సరిగ్గా ఇపుడు అదే జరగబోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మహేష్ 25వ సినిమా కూడా కావటంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ తల్లిగా సీనియర్ స్టార్ హీరోయిన్ జయప్రద నటిస్తున్నారు. మరి ఈ ఇద్దరి కాంబినేషన్ చూడడానికి రెండు కళ్ళూ చాలవని అపుడే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. బ్యూటీ క్వీన్ జయప్రద, మహేష్ సీన్లు వెండి తెరపై వెన్నెలలే కురిపిస్తాయని అంటున్నారు.
ఇక మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా యువ కథానాయకుడు అల్లరి నరేష్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమా 2019 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. మొత్తానికి మహేష్ మూవీపై అంచనాలు భారీగానే పెరిగిపోతున్నాయి.