టాలీవుడ్ లో అప్పట్లో యాంగ్రీ యంగ్ మాన్ గా పేరు తెచ్చుకున్నారు డాక్టర్ రాజశేఖర్. మొదట్లో విలన్ గా నటించిన రాజశేఖర్ తర్వాత హీరోగా మారారు. ఆయన కెరీర్ లో ‘అంకుశం’ అద్భుతమైన విజయం సాధించింది..ఆ తరహా పాత్రలో డాక్టర్ రాజశేఖర్ పలు సినిమాల్లో నటించారు. అలాంటి సినిమాల్లో నటించడం వల్ల జనాలకు బోర్ కొట్టడంతో..రూట్ మార్చి ఫ్యామిలీ తరహా సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. గత కొంత కాలంగా డాక్టర్ రాజశేఖర్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో సినిమాలకు దూరంగా ఉండటం మొదలు పెట్టారు.
చాలా గ్యాప్ తర్వాత గరుడవేగ సినిమాలో నటించాడు డాక్టర్ రాజశేఖర్. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన గరుడవేగ ఘన విజయం సాధించింది. దాంతో యాంగ్రీయంగ్ మాన్ ఈజ్ బ్యాక్ అన్నారు. ప్రస్తుతం డాక్టర్ రాజశేఖర్ మరో సినిమాలో నటించబోతున్నారు. ఆయన సరసన ఆ మద్య కాజల్ నటించబోతుందని వార్తలు వచ్చాయి..కానీ అవి రూమర్లు అని తెలిశాయి. తాజాగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ నటించబోయే సినిమాలో అంజలి రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతోందట.
ఈ సినిమాలో అతనికి జోడీగా నటించేందుకు చిత్ర యూనిట్ ఇటీవల అంజలీని సంప్రదించగా.. ఆమె ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. గత ఏడాది విడుదలైన ‘చిత్రాంగధ’ సినిమాతో చివరిగా తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన అంజలి.. ఆ తర్వాత టాలీవుడ్‌కి దూరంగా ఉంటోంది. ఈ సినిమాకి ‘కల్కి’ అనే టైటిల్ పరిశీలనలో ఉండగా.. అంజలి పాత్రపై ఇంకా స్పష్టత రావడం లేదు. ఈ ఏడాది ఆఖర్లో పట్టాలెక్కనున్న ఈ సినిమాని రాజశేఖర్ తన సొంత బ్యానర్లో నిర్మించనున్నాడు.