నిషేధ ప్రమాదపు అంచున సైరా !

Seetha Sailaja
250 కోట్ల భారీ బడ్జెట్ తో ‘బాహుబలి’ కలక్షన్స్ రికార్డులు బ్రేక్ చేయాలి అన్న సంకల్పంతో నిర్మింపబడుతున్న ‘సైరా’ కు ఊహించని నిషేద ప్రమాద హెచ్చరికలు వస్తూ ఉండటం షాకింగ్ న్యూస్ గా మారింది. చిరంజీవి ‘సైరా’ ను తెలుగుతో పాటు తమిళ కన్నడ మళయాళ హిందీ భాషలలో డబ్ చేయబోతున్న విషయం తెలిసిందే.

అందుకోసమే తమిళ కన్నడ హిందీ భాషలలో ప్రముఖ నటీ నటులను ఈమూవీలోని  కీలక పాత్రలలో నటింపచేస్తూ ‘సైరా’ మార్కెట్ కు వివిధ భాషలకు చెందిన దక్షిణాది సినిమా రంగంలో మంచి రేట్ పలికేలా ఇప్పటి నుంచే వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థుతులలో త్వరలో కన్నడ సినిమా రంగం తీసుకోబోయే ఒక కీలక నిర్ణయం ‘సైరా’ కు శాపంగా మారుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

కన్నడ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం అత్యంత భారీ బడ్జెట్ తో తీసే తెలుగు తమిళ మళయాళ సినిమాల డబ్బింగ్ లను కర్ణాటకలో విడుదల చేసే విషయంలో వచ్చే సంవత్సరం నుండి నిషేధం విధించాలని కన్నడ సినిమా పరిశ్రమ పై తీవ్ర ఒత్తిడి పెరిగి పోతోంది అన్నవార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ ఆలోచన కన్నడ సినిమా రంగంలో ఎప్పటి నుంచో ఉన్నా తెలుగు తమిళ భారీ బడ్జెట్ సినిమాలు కన్నడంలోకి డబ్ చేసి విడుదల చేసినప్పుడు ఆ మ్యానియా వల్ల చాలచిన్న కన్నడ సినిమాలు దెబ్బ తింటున్న నేపధ్యంలో ఈ డబ్బింగ్ నిషేదం పై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది అని అంటున్నారు. 

వచ్చే సంవత్సరం నుండి ఈ ఆలోచన క్రియా రూపం దాలిస్తే మొట్టమొదటగా మన ఫిలిం ఇండస్ట్రీ నుండి బలి అయ్యేది ‘సైరా’ ‘సాహో’ సినిమాలు అని అంటున్నారు. మన తెలుగు సినిమాల కన్నడ డబ్బింగ్ కు కర్ణాటకలో చాల మంచి మార్కెట్ ఉంది. ‘బాహుబలి’ కన్నడ డబ్బింగ్ కు కూడ అక్కడ రికార్డ్ కలక్షన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ‘సైరా’ ఈ ఊహించని పరిణామాన్ని ఎలా వ్యూహాత్మకంగా పరిష్కరించుకుని తన కన్నడ మార్కెట్ నష్టపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి..      


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: