తెలుగులో వస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 మొదట్లో కాస్త వివాదంగా నడిచింది. కామన్ మాన్ గా ఎంట్రీ ఇచ్చిన సంజన మొదటి వారం ఎలిమినేట్ అవడం..తర్వాత కౌశల్ పై కొంత మంది టీమ్ లా ఏర్పడి మానసికంగా అటాక్ చేయడం..విచిత్రమైన టాస్క్ లతో ఇంటి సభ్యుల మద్య గొడవలు..తనిష్, సునయన మద్య సాగిన సిల్లీ వేషాలు..వెరసి బిగ్ బాస్ అర్థభాగం వరకు రచ్చ రచ్చగా సాగింది. ఈ మద్య కాస్త గాడిన పడినట్లు కనిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 2 పతాక ఘట్టానికి చేరుకోవడంతో చివరి ఎపిసోడ్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిరేపే విధంగా మలుస్తున్నారు.
ఇప్పటికి 93 ఎపిసోడ్స్‌ను సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసిన బిగ్ బాస్ షో 94 ఎపిసోడ్‌కి పూర్తి ఎమోషన్ టచ్ ఇచ్చారు. ఇక బిగ్ బాస్ హౌజ్ మెంట్స్ సభ్యులను బిగ్ బాస్ ‘రిమోట్ కంట్రోల్’ టాస్క్ తో ముప్పతిప్పలు పెడుతున్నాడు. ఈ టాస్క్ ప్రకారం బిగ్ బాస్ అనౌన్స్ మెంట్ ప్రకారం ఏం చెప్తే అది చేయాలని ఆ సమయంలో.. ఎక్కడ ఎలాంటి పరిస్థితులల్లో ఉన్నా రూల్స్‌ని అతిక్రమించరాదని .. స్లో మోషన్, రివైండ్, ఫార్వర్డ్, ఫ్రీజ్ లాంటి అనౌన్స్ మెంట్ వచ్చినప్పుడు వాటిని విధిగా పాటించాలన్నారు బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడ్ లో ఓ జోకర్ వచ్చి ఇంట్లో అల్లరి చేసిన విషయం తెలిసిందే.
అయితే నిన్నటి ఎపిసోడ్ లో సెంటిమెంట్ తో అందరూ ఆనందపరవశంలో మునిగిపోయారు. కంటెస్టెంట్స్ అందర్నీ ఫ్రీజ్‌లో ఉంచి హౌస్‌లోకి సామ్రాట్ తల్లిని పంపించారు. ఆమె వచ్చేసరికి ఫ్రీజ్‌లో ఉన్న సామ్రాట్ తల్లిని చూసి ఎమోషన్ అయ్యారు. ఇక హౌస్‌లో ఉన్న ఒక్కొక్కరి దగ్గరకు వెళ్లి దీవెనలు అందించారు సామ్రాట్ తల్లి. అనంతరం ఫ్రీజ్ నుండి బయటకు వచ్చిన సామ్రాట్ తల్లిని కౌగిలించుకుని ఎమోషన్ అయ్యారు. సామ్రాట్ తల్లి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లిన తరువాత అమిత్ కొడుకు, భార్య హౌల్లోకి వచ్చారు.
మొదటి అమిత్ కొడుకు ముద్దు ముద్దు మాటలకు ముగ్ధులయ్యారు కంటెస్టెంట్స్. కొద్ది సేపటి తర్వాత అమిత్ భార్య కూడా రావడంతో కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చేశాడు అమిత్. ఆ తర్వాత దీప్తి నల్లమోతు కొడుకు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. చానాళ్ల తరువాత కొడుకుని చూసిన దీప్తి.. తీవ్ర భావోద్వేగంతో తల్లిడిల్లిపోయింది.అనంతరం స్టోర్ రూమ్‌లో భర్త ప్రత్యక్ష్యం కావడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. కొడుకు, భర్తను చూసి ఎమోషన్ అయ్యింది. భర్త సలహాలను, సూచనలను అందుకున్న దీప్తి.. ఇకపై కాన్ఫిడెంట్‌గా గేమ్ ఆడతానన్నారు.