కౌశల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన అమిత్!
తెలుగులో వస్తున్న బిగ్ బాస్ 2 చివరి అంకానికి వచ్చింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో ఆరుగురు మాత్రమే మిగిలారు. ఆదివారం జరిగిన ఎలిమినేషన్ లో 95 రోజులుగా ఇంట్లో మంచోడు అనే ముద్రతో బతికిపోతున్న అమిత్ బయటకు వచ్చారు. బిగ్ బాస్ సీజన్ -2లో ఏమైనా జరగొచ్చంటూ....నాని చెప్పినట్లుగానే ఈ సీజన్ ముగింపునకు వస్తోన్న తరుణంలో అనూహ్య పరిణామాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. నాని వీక్ ఎండ్ లో వచ్చి ఒక్కో కంటెస్టెంట్‌కి మొట్టికాయలే స్తున్న నాని ఆదివారం నాటి 99వ ఎపిసోడ్లో ‘నీ మంచికోరి’ అనే సరదా సరదా టాస్క్‌లో ఫుల్ ఎంటర్టైన్ చేశారు.
ఈ టాస్క్‌లో భాగంగా తమ తోటి కంటెస్టెంట్లో ఉన్న ఏదైతే నెగిటివ్ క్వాలిటీ ప్రత్యక్షంగా జనాలకు చూపించారు. మరోవైపు బయట కౌశల్ ఆర్మీ విజృంభిస్తుంటే.. లోపల మాత్రం దీనికి భిన్నంగా జరుగుతోంది. గత వారం ఎలిమినేట్ అయిన శ్యామలను నాని.. టాప్ త్రీలో ఎవరు ఉంటారని అడిగితే.. కౌశల్ పేరు చెప్పలేదు. అసలే కౌశల్ ఫాలోవర్స్ సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తుంటారు.
గత రెండు వారాల నుంచి బిగ్ బాస్ వేటు తప్పించుకుంటోన్న అమిత్...ఈ వారం ఎగ్జిట్ కాక తప్పలేదు. ప్రస్తుతం మిగిలిన ఆరుగురు కంటెస్టెంట్లలో మరొకరు వచ్చే ఆదివారం ఎలిమినేట్ అవుతారు. ఈవారం ఎలిమినేషన్లో ఉన్న దీప్తి, గీతా, కౌశల్, అమిత్, కౌశల్లలో తొలిత సేఫ్ అయ్యింది దీప్తి నల్లమోతు అని కాస్త రిలీఫ్ ఇచ్చారు నాని. ఇక మిగిలిన నలుగురిలో రెండో హౌస్ మేట్‌గా కౌశల్‌ని సేఫ్ చేశారు. మూడో హౌస్ మేట్‌గా గీతా.. నాలుగో హౌస్‌మేట్‌గా రోల్ రైడా సేఫ్ కావడంతో.. మిగిలిన అమిత్ ఈవారం బిగ్ బాస్ హౌస్ నుండి బ్యాగ్ సర్దేశాడు.
స్టేజ్ మీదకు వచ్చిన అమిత్ ని హోస్ట్ నాని హౌస్ లో ఉన్న ఒక్కో కంటెస్టెంట్ పై తన ఒపీనియన్ చెప్పమని అడగగా.. రోల్ జెన్యూన్ అండ్ రియల్ అని.. దీప్తి బాగా బయపడుతుందని.. సేఫ్ ప్లే ఆడుతుందని అన్నారు. ఇక కౌశల్ విషయంలో మాత్రం కాస్త ఘాటుగానే మాట్లాడారు. కౌశల్ కన్నింగ్ అనొచ్చు.. స్మార్ట్ అనొచ్చు.. ఒక్కో వీక్ ఒక్కోలా ఉంటారు.. తనేలా ఆడుతున్నారో అందరూ అలానే ఆడాలని అనుకుంటారు. ఆ విషయంలో చాలా మందికి ఇబ్బంది కలుగుతున్నా..కొంత మంది కొన్ని రకాలుగు ఎక్సపోజ్ అవుతున్నారంటూ కౌశల్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
సామ్రాట్ బెస్ట్ ఫ్రెండ్.. చాలా మంచి వ్యక్తని.. గీతామాధురి ఓపెన్ గా మాట్లాడుతుందని.. మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉందని అన్నారు. ఇక బిగ్ బాస్ టాప్ త్రీలో ఎవరు ఉంటారని అనుకుంటున్నావని నాని ప్రశ్నించగా.. రోల్ రైడా, సామ్రాట్, గీతామాధురిల పేర్లు చెప్పారు. ఇక ఎలిమినేట్ కంటెస్టెంట్‌కి సాంప్రదాయంగా వస్తున్ బిగ్ బాంబ్‌ను దీప్తి నల్లమోతుపై విసిరారు అమిత్. దీని ప్రకారం హౌస్‌లో వారం రోజుల పాటు.. కంటెస్టెంట్స్ అందరి జట్టును దీప్తి మాత్రమే దువ్వాలి.