‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ ’ అమితాబ్ ఫస్ట్ లుక్!
బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్స్‌లో ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ మూవీ ఒకటి. అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ ఫస్ట్ టైమ్ కలిసి నటిస్తోన్న ఈ మూవీపై బీటౌన్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో అందరూ అగ్రతారలు నటించడం విశేషం. ధూమ్ 3 సినిమాతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న స్టార్ రైటర్ విజయ్ కృష్ణ ఆచార్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 1839 కాలం నాటి నవల ‘కన్ఫెషన్స్ ఆఫ్ థగ్’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్, రోనిత్ రాయ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
లేటెస్ట్గా ఈ మూవీలో అమితాబ్ క్యారెక్టర్‌కు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసారు. ఈ మూవీలో బిగ్ బీ...‘ఖుదాబక్ష్’ అనే సర్థార్ పాత్రలో నటిస్తున్నాడు. ‘ఖుదాభక్ష్’గా అమితాబ్ లుక్ చాలా టెర్రిఫిక్‌గా ఉంది. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనలో ఇండియా నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. 1839లో ఫిలిప్ మీడోస్ టేలర్ రాసిన కన్ఫెషన్స్ ఆఫ్ ఎ థగ్ అనే నవల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రూపొందించారు. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ 3డీ, ఐమ్యాక్స్ ఫార్మాట్లలో హిందీతోపాటు తమిళ్, తెలుగులలో రిలీజ్ కానుంది.
బందిపోటు ముఠా,..బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. దీపాకళి సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే టైటిల్ లోగో మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన యూనిట్ తాజాగా సినిమాలో అమితాబ్లుక్ను రివీల్ చేశారు. యష్ రాజ్ ఫిలింస్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు అజయ్-అతుల్ సంగీతమందిస్తున్నారు.
Wading through storms & battles, the commander of Thugs has arrived. @SrBachchan as #Khudabaksh#ThugsOfHindostan | @aamir_khan | #KatrinaKaif | @fattysanashaikh | #VijayKrishnaAcharya | @TOHTheFilm pic.twitter.com/fxfVln7Ky5— Yash Raj Films (@yrf) September 18, 2018