కౌశల్ ను సమస్యలలో పడేసిన ఆమీడియా సంస్థ షాకింగ్ కథనం !

Seetha Sailaja
కౌశల్ ఆర్మీ ఈపేరు ప్రస్తుతం మీడియాకు హాట్ టాపిక్. కొన్ని న్యూస్ ఛానెల్స్ ఏకంగా కౌశల్ ఆర్మీ గురించి ప్రత్యేకంగా కధనాలు ప్రసారం చేస్తున్నాయి అంటే ప్రస్తుతం కౌశల్ ఇమేజ్ ఏస్థాయికి చేరిపోయిందో అర్ధం అవుతుంది. ‘బిగ్ బాస్ సీజన్-2’ ను బుల్లితెర పై చూస్తున్న ప్రేక్షకులు అంతా కౌశల్ గేమ్ ప్లాన్ కు ముగ్ధులు అవుతున్న నేపధ్యంలో ఇతడి అభిమానులు ఉభయ తెలుగురాష్ట్రాలలోను విపరీతంగా పెరిగి పోతున్నారు. 

ఇలాంటి పరిస్థుతులలో కౌశల్ కు సంఘీభావం చెపుతూ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ తో పాటు విజయవాడలో కూడ భారీ ర్యాలీలు జరిగాయి. అయితే ఈ ర్యాలీలు నిర్వాహణ వెనుక ఒక అజ్ఞాత వ్యక్తి ఉన్నాడని కౌశల్ ఆర్మీ ఒక పెయిడ్ ఆర్మీగా మారింది అంటూ కౌశల్ వ్యతిరేకులు ప్రచారాలు చేస్తున్నారు. 

ఇలాంటి పరిస్థుతులలో ఈమధ్య విజయవాడలో జరిగిన కౌశల్ ఆర్మీ ర్యాలీకి సంబంధించి వార్తలను కవర్ చేసిన ఒక మీడియా సంస్థ బయటపెట్టిన వార్తలు షాకింగ్ న్యూస్ గా మారాయి.  ఆమీడియా సంస్థ కౌశల్ బొమ్మ ఉన్న టీ షర్టుతో వచ్చిన ఒక యువకుడుని కౌశల్ ను ఏవిషయంలో అభిమానిస్తున్నావు అని ప్రశ్నించగా తన బండిలో వచ్చేటప్పుడు 200 రూపాయలతో పెట్రోల్ కొట్టించారని వెళ్లేటప్పుడు మరో 200 రూపాయలు కొట్టిస్తామని చెప్పారని అంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు షాకింగ్ న్యూస్ గా మారాయి. 

అంతేకాదు ఈవ్యవహారం అంతా ప్రసాద్ అనే వ్యక్తి చేయిస్తున్నాడని ఆవ్యక్తి చెప్పినట్లు ఆమీడియా సంస్థ కథనాలు చెపుతోంది. ప్రస్తుతం ఈన్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈవిషయాలన్నీ కౌశల్ ఎదుగుదలను చూసి తట్టుకోలేని కొందరు వ్యక్తులు సృష్టిస్తున్న వాస్తవంకాని కథనాలు అంటూ కౌశల్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఏమైనా ఒక బుల్లితెర షోతో ఒక వ్యక్తికి టాప్ హీరోలతో సమానంగా క్రేజ్ ఏర్పడటం ఆశ్చర్యంగా మారిన విషయం..    



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: