పగవాడికి కూడా ఇలాంటి అన్నయ్య ఉండొద్దు బాబోయ్ : వెన్నెల కిషోర్

frame పగవాడికి కూడా ఇలాంటి అన్నయ్య ఉండొద్దు బాబోయ్ : వెన్నెల కిషోర్

siri Madhukar
టాలీవుడ్ లో ‘హృదయకాలేయం’ సినిమాతో బర్నింగ్ స్టార్ గా ఇంట్రడ్యూస్ అయిన కామెడీ హీరో సంపూర్ణేష్ బాబు. ఇండ్ట్రీలోకి వచ్చే రావడమే...తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.  బర్నింగ్ స్టార్ అని బిరుదుతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.  ఆ సినిమా తర్వాత సింగం 123 తో మరోసారి నవ్వించిన సంపూర్ణేష్ బాబు  పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు.  అయితే ఆ మద్య కొబ్బరి మట్ట సినిమాతో వస్తున్నాని అనౌన్స్ చేశారు..కానీ అది పెండింగ్ పడుతూ వస్తుంది.

నిన్న ఈ సినిమాకు సంబంధించిన  సాంగ్ ప్రోమో నిన్న రిలీజ్ అయింది. ఆ పాటలో అన్నదమ్ముల అనుబంధాన్ని కాస్తంత ఎమోషనల్‌గా కావలిసిననంత అతిగా చూపించారు. ఈ అతే సంపూ సినిమాలకు బలమనుకోండి అది వేరే విషయం.  సాధారణంగానే సంపూర్ణేష్ బాబు సినిమాలంటే కాస్త అతి ఎక్కువగా ఉంటుంది. తాజాగా విడుదలైన సాంగ్ ప్రోమోలో ఈ అతి కాస్త ఎక్కువైంది. అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని అతిగా చూపిస్తూ ఈ ప్రోమోని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పాటను చూసిన వెన్నెల కిషోర్ పగవాడికి కూడా అలాంటి అన్నయ్య ఉండకూడదని వెల్లడిస్తూ ఓ ట్వీట్ చేశాడు.  


‘‘కొబ్బరిమట్ట సాంగ్ ప్రోమోకి సాక్ష్యంగా ఉన్నందుకు లక్కీ. పగవాడికి కూడా ఇలాంటి అన్నయ్య ఉండకూడదు. సంప్రదాయ విలువలతో అద్భుతమైన లిరిక్స్‌తో ఒక ఘాటైన సందేశం ఇస్తూ గుండెకి లోతైన గాయం చేసే ఒక సంపూర్ణమైన గేయం. సంపూర్ణేష్ ఆన్ ఫైర్, సాయి రాజేష్ అన్నా మీకో నమస్కారం’’ అని వెన్నెల కిషోర్ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Lucky to witness #KobbariMatta song promo. Pagavaadiki kooda ilanti annayya undakoodadani traditional values tho n heavenly lyrics tho oka ghaataina sandesham isthu gunde ki lothaina gaayam chese oka sampoornamaina geyam..@sampoornesh on fire and @sairazesh anna meeko 🙏🏻🤣🤣🤗

— vennela kishore (@vennelakishore) September 6, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: