దేవదాస్ సక్సస్ మీట్ లో కనిపించని నాని ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు !

Seetha Sailaja
నాని నాగార్జునలు కలిసినటించిన 'దేవదాస్‌' మూవీకి డివైడ్ టాక్ వచ్చిన నేపధ్యంలో ఈమూవీ కలక్షన్స్ బాగాపడిపోయాయి అన్నది ఓపెన్ సీక్రెట్. అయితే ఈవిషయానికి వేరేవిధంగా ట్విస్ట్ ఇస్తూ ఈమూవీకి సంబంధించిన సక్సస్ మీడియా మీట్ ను నిర్వహించడమే కాకుండా ‘దేవదాస్' 7రోజుల్లో 41కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేసింది అంటూ ఈమూవీ మీడియా మీట్ లో నాగార్జున చేసిన కామెంట్స్ చాలమందిని ఆశ్చర్య పరుస్తున్నాయి.

అయితే నాగార్జున అత్యంత ఉత్సహంగా మాట్లాడుతూ చెలరేగిపోయిన ఈసక్సస్ మీట్ లో నాని కనిపించక పోవడంతో నాని కావాలని ఈసక్సస్ మీట్ కు దూరంగా ఉన్నాడా లేదంటే ‘బిగ్ బాస్’ తలనొప్పులు తీరిపోయాయని తన మొక్కులు తీర్చుకోవడానికి కాశి వెళ్ళాడా అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ‘దేవదాస్’ సక్సస్ మీట్ లో నాగార్జున మాట్లాడుతూ నాని దాస్‌ పాత్రలో చాలా బాగా చేశాడని మల్టీస్టారర్‌ అంటే ఎవరి రోల్స్‌ ఎక్కువ అనిఆలోచిస్తే సినిమా చెడిపోతుందని అంటూ నాని ఈసినిమా విషయంలో సహకారానికి నాగార్జున కృతజ్ఞతలు తెలియచేసాడు. 

ఇది ఇలా ఉండగా వరుస విజయాలతో దూసుకుపోతూ ఒక్కసారిగా తన మార్కెట్‌ని రెండింతలు చేసుకున్న నాని సక్సస్‌ ని నిలబెట్టుకునేందుకు ఖంగారులో ప్రయత్నాలు చేస్తూ ఒకదాని పై ఒకటి రాంగ్‌ స్టెప్స్ వేస్తున్నాడు అంటూ వస్తున్న విమర్శలు నానీకి తీవ్ర కలవరపాటును కలిగిస్తున్నట్లు టాక్. డ్యూయల్‌ రోల్‌ మోజులో ఏమాత్రం కథా బలం లేని 'కృష్ణార్జున యుద్ధం' లో నటించి తనకు తానుగా ఫ్లాప్ ల సమస్యను తెచ్చుకోవడమే కాకుండా క్రేజీ కాంబినేషన్ పై ఉన్న మోజుతో కథ గురించి ఏమాత్రం పట్టించుకోకుండా నాగార్జునతో కలిసి ‘దేవదాస్’ సినిమాలో నటించి మరోతప్పు చేసాడు అంటూ నాని సన్నిహితులు కామెంట్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

గతవారం విడుదలైన ‘దేవదాస్’ మూవీ కలక్షన్స్ పడిపోయినా ఆ విషయాలు పట్టించుకోకుండా ఈమూవీ కలక్షన్స్ బాగున్నాయి అంటూ ఛానల్స్ ముందుకు వచ్చి లేటెస్ట్ గా నాగార్జున ఇస్తున్న ఇంటర్వ్యూలలో కూడ నాని కనిపించడం లేదు. దీనికితోడు నానీకి ఓవర్సీస్ లో మంచి సాలిడ్ మార్కెట్ ఉన్నా ఇప్పుడు అనూహ్యంగా నాని క్రేజ్ ఓవర్సీస్ మార్కెట్ లో తగ్గిపోయి విజయ్ దేవరకొండకు ఓవర్సీస్ లో క్రేజ్ పెరిగిపోవడంతో సరైన నిర్ణయాలు తీసుకోకుండా కథాబలం లేని సినిమాలలో నటిస్తే నాని కెరియర్ మళ్ళీ ప్రమాదంలోకి వెళ్ళిపోయే అవకాసం ఉంది అంటూ మరికొందరు నానీకి హెచ్చరికలు ఇస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: