నన్ను బలంగా కౌగిలించుకునేవాడు... విడిపించుకోవడానికి కష్ట పడేదాన్ని !

Prathap Kaluva

కంగనా రనౌత్ ఏ విషయాన్ని అయినా కుండలు  బద్దలు కొట్టి నట్లు ఉన్నది ఉన్నట్లు చెబుతుంది ఎవరికీ భయపడదు చివరకి స్టార్ హీరోల మీద వ్యాఖ్యలు చేయాలనుకున్న నిర్మొహమాటంగా చేస్తుంది. అయితే క్వీన్ డైరెక్టర్‌పై ఆరోపణలు గుప్పించారు. ‘మేం కలిసినప్పుడల్లా.. ఆప్యాయంగా పలకరించడం కోసం ఒకరినొకరం హత్తుకునే వాళ్లం. కానీ అతడు నా మెడలోకి తలదూర్చి నన్ను గట్టిగా హత్తుకునేవాడు. నా జట్టు వాసన చూసేవాడు. అతడి కౌగిలి నుంచి బయటపడటానికి నేనెంతో బలంగా ప్రయత్నించాల్సి వచ్చేది. నీ వాసన నాకిష్టం కంగనా అని చెప్పేవాడ’ని జాతీయ ఉత్తమ నటిగా అవార్డు సొంతం చేసుకున్న కంగనా తెలిపింది. 


2014లో అతడితో కలిసి సినిమా చేస్తున్నప్పుడు.. సెట్స్‌లో ఏదో తేడా కనిపించిందని కంగనా తెలిపింది. 2014లో క్వీన్ షూటింగ్ సమయంలో వికాస్‌కు పెళ్లయ్యింది. కానీ అతడు వేరేవాళ్లతో సంబంధాలుండేవి. ఇతరుల గురించి నేనేం మాట్లడను. కానీ అది ఆ అడిక్షన్‌ ఇతరులకు ఇబ్బందిగా మారుతుంది. ప్రతి రాత్రి అతడు పార్టీ చేసుకునేవాడు. తొందరగా పడుకున్నందుకు నన్ను అపహాస్యం చేసేవాడు’ అని కంగనా తెలిపింది. అనురాగ్ కశ్యప్, మధు మంతెన, విక్రమాదిత్యలతో చేతులు కలిపిన వికాస్.. 2015లో ఫాంటమ్ ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు.

వికాస్ తనను లైంగికంగా వేధించారని మాజీ ఉద్యోగి ఒకరు ఆరోపించారు. అనురాగ్ కశ్యప్‌ సహా అందరికీ చాలా కాలం క్రితమే ఈ విషయం తెలిసినా సరిగా స్పందించలేదని ఆమె వాపోయారు. ఈ విషయాన్ని సరిగా హ్యాండిల్ చేయలేదని అనురాగ్ కూడా అంగీకరించారు. ఫాంటమ్ ఫిల్మ్స్‌ను త్వరలోనే మూసేయబోతున్నారు. సూపర్ 30 సినిమానే ఈ బ్యానర్లో చివరి మూవీ కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: